Nara Lokesh inspects AP Maker Lab on Wheels vehicle: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో దీన్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికలను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు.
పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని అన్ని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాలను పంపించనున్నట్లు లోకేశ్ తెలిపారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ఈఎస్జీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, ఎస్టీఈఎం లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యమని తెలిపారు.
విజయవాడ, విశాఖకు డబుల్ డెక్కర్ మెట్రోలు- 100% నిధులు కేెంద్రం నుంచే!
బేసిక్ స్కిల్ అందించడమే ముఖ్య ఉద్దేశం: విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వర్క్‌స్టేషన్‌లు, ప్రయోగాల కోసం కిట్‌లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ.5 కోట్లతో ల్యాబ్‌తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించడమేగాక విద్యార్థులకు కోర్సు కంటెంట్‌తో పాటు ట్రైనర్ సపోర్టు అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున 1,500 ఖర్చుచేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి 3 నెలలకు 4,800 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్‌లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు.
కొత్త చిక్కుల్లో పేర్ని నాని - 31వేల ట్రాక్టర్ల బుసక బొక్కేసిన రేషన్ దొంగ
ఏపీ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు - తగ్గనున్న ఛార్జీలు - ఏ ఏ రూట్లలో తిరుగుతాయంటే?