CM Chandrababu Naidu Two Days Kuppam Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ యూనివర్శిటీలో 'స్వర్ణ కుప్పం విజన్-2029' డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. అలాగే కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి కానున్నారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారని నేతలు తెలిపారు. 7వ తేదీ ఉదయం కుప్పం తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.
మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారని నేతలు వెల్లడించారు. ఇక 8వ తేదీ ఉదయం విశాఖపట్నం వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సౌరపలకలను అమర్చుతున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద కుప్పంలోని ప్రజలకు వంద శాతం రాయితీతో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తును అందించాలని నిర్ణయించారు. తాజాగా కుప్పం మండలం నడిమూరులో ఇళ్లపై సౌర పలకలు అమర్చడంతో వాటి వెలుగులు గ్రామంలో ప్రసరిస్తున్నాయి. నియోజకవర్గంలో ఉన్న అన్ని ఇళ్లకూ సౌర పరికరాలు అమర్చనున్నారు.
సంపూర్ణ రాయితీ: పీఎం సూర్యఘర్‌లో భాగంగా కేంద్రం 60 శాతం రాయితీ ఇవ్వగా, కుప్పం ప్రజలకు పూర్తిస్థాయిలో సౌర విద్యుత్తు అందించాలన్న ముఖ్యోద్దేశంతో మిగిలిన 40 శాతం సైతం రాష్ట్ర ప్రభుత్వం భరించి పథకాన్ని వర్తింపజేయనుంది. నియోజకవర్గంలో సంపూర్ణంగా సౌర విద్యుత్తు ఏర్పాటుకు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చుకానుంది. ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సౌర వెలుగులు రానుండటంతో ప్రజలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం - ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు: చంద్రబాబు
2047 నాటికి రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఎదగాలి - చదువుకున్న యువతే ఆస్తి: చంద్రబాబు