ETV Bharat / state

టేస్టీ అండ్​ హెల్దీ : "స్వీట్​ కార్న్" కిచిడీ - ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ - SWEET CORN KICHIDI RECIPE

ఎప్పుడూ పప్పులతో కిచిడీ కాదు - వెరైటీగా ఇలా స్వీట్​ కార్న్​ కిచిడీని ఓసారి ట్రై చేయండి!

How to Make Sweet Corn Kichidi
How to Make Sweet Corn Kichidi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 3:00 PM IST

How to Make Sweet Corn Kichidi : చాలా మందికి కిచిడీ అంటే ఎంతో ఇష్టం. అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేసుకోవడానికి తగినంత టైమ్ లేనప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుంటుంటారు ఎక్కువమంది. అయితే, మీరు ఇప్పటివరకు కిచిడీని రకరకాలుగా ఇంట్లో చేసి ఉంటారు. కానీ, ఓసారి ఇలా వెరైటీగా స్వీట్​కార్న్​తో కిచిడీని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ కిచిడీ ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఈ స్వీట్​ కార్న్​ కిచిడీ లంచ్​లోకి కూడా పర్ఫెక్ట్​గా ఉంటుంది. పైగా కిచిడీ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి ఇక ఆలస్యం చేయకుండా ​ఈ హెల్దీ కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • స్వీట్​కార్న్-2 టేబుల్​స్పూన్లు (ఉడికించుకోవడం కోసం)
  • స్వీట్​కార్న్-2 కప్పులు
  • బియ్యం-గ్లాసు
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె-3 టేబుల్​స్పూన్లు
  • ఎండుమిర్చి-2
  • జీలకర్ర-అరటీస్పూన్​
  • పచ్చిమిర్చి-3
  • వెల్లుల్లి-5
  • అల్లం తురుము-టేబుల్​స్పూన్​
  • ఉల్లిపాయ-1
  • టమాటా-1
  • వేపిన జీలకర్రపొడి-అరటీస్పూన్​
  • కారం-టీస్పూన్​
  • పసుపు-పావుటీస్పూన్​
  • కొబ్బరి పాలు-అరకప్పు

తయారీ విధానం..

  • ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి.. గంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి.
  • అనంతరం 2 టేబుల్​స్పూన్ల స్వీట్​కార్న్​ ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోయండి. ఇందులో కాస్త ఉప్పు వేసి 80 శాతం ఉడికించుకోండి. (మీ దగ్గర ఫ్రోజోన్​ స్వీట్ ​కార్న్​ ఉంటే కడిగేసి ఉపయోగించుకోవచ్చు.)
  • ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పుల స్వీట్ ​కార్న్​ తీసుకుని నీళ్లు యాడ్​ చేయకుండా మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • అనంతరం ప్రెషర్​ కుక్కర్లో నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర వేసి కాసేపు ఫ్రై చేయండి.
  • ఆపై పచ్చిమిర్చి తరుగు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి, అల్లం తురుము వేసి వేపాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వేపండి.
  • అనంతరం టమాటా ముక్కలు వేసి కాస్త మెత్తబడనివ్వాలి.
  • ఇప్పుడు వేపిన జీలకర్రపొడి, కారం, పసుపు వేసి మిక్స్​ చేయాలి.
  • తర్వాత గ్రైండ్​ చేసుకున్న స్వీట్​ కార్న్​ పేస్ట్​ వేసి కలపాలి. అడుగుపట్టకుండా ఉండడానికి కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపాలి.
  • స్వీట్ ​కార్న్​ వేగిన తర్వాత నానబెట్టిన రైస్​ వేసి కలపండి. (మీరు బాస్మతి రైస్​ కూడా ఉపయోగించవచ్చు)
  • ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి మిక్స్​ చేయండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • ఇందులో 2 గ్లాసుల నీరు పోసుకుని అన్నం వండుకున్నట్లు 3 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోండి.
  • ఆపై మూత తీసి ఓ సారి కలపండి. అనంతరం వేడివేడి కప్పు నీరు పోసి, ఉడికించుకున్న స్వీట్​కార్న్​, కొత్తిమీర తరుగు వేసి మిక్స్​ చేయండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి కిచిడీని 5 నిమిషాలు ఉడికించుకోండి.
  • ఆపై నెయ్యి వేసి కలిపి స్టౌ ఆఫ్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే కమ్మటి స్వీట్​కార్న్​ కిచిడీ రెడీ.
  • దీనిని వేడివేడిగా ఆలూ చిప్స్​, సేవ్​తో సర్వ్​ చేసుకోండి టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది.
  • నచ్చితే ఇలా కిచిడీ ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

"పాలకూర కిచిడీ" పోషకాల పంట - నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోండిలా

పోషకాలతో నిండిన అన్ని పప్పుల అద్భుత "కిచిడీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.