Youth Fired Five Bike After Taking Ganja in Vijayawada : విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని వీధిలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టాడు. మంటల్లో రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. చుట్టుపక్కల ఇళ్ల బయట ఆరబెట్టిన దుస్తులు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఈ ప్రాంతంలో నిత్యం గంజాయి మత్తులో కొందరు యువకులు హంగామా సృష్టిస్తున్నారని పోలీసులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అర్ధరాత్రి వాహనాలకు నిప్పుపెట్టి యువకుడు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. దీని ఆధారంగా ఈ ఘటనపై భవానిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బల్బులో డ్రగ్స్ - బెంగళూరు టు హైదరాబాద్ వయా గుంటూరు
తరచూ రాత్రి పూట ఇక్కడ యువకులు గంజాయి తాగుతారు. ఖాళీ స్థలం, ఆటోలు ఉండటంతో వారు ఇష్టారీతిన వ్యవహరిస్తారు. రాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఇళ్ల ముందు ఉన్న ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. చాలా నష్టపోయాం. పోలీసులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.' -బాధితులు
Police Arrested Smugglers And Seized 110 Kg Ganja in anakapalle District : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డరోడ్డు సర్కిల్ వద్ద లాడ్జి వెనక ఉన్న కారులో గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయిని రాజస్థాన్ తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారును సీజ్ చేశారు.
ఆస్తులు లేకపోతే ఆధార్, రేషన్ కార్డులు సీజ్- హోంమంత్రి అనిత