ETV Bharat / offbeat

'ఆంధ్రా గోవా' - రిషికొండకు దీటుగా యారాడ బీచ్ - BLUE FLAG BEACH IN VISAKHA

పర్యాటక రంగంపైనా కూటమి ప్రభుత్వం దృష్టి - యారాడ బీచ్‌ అభివృద్ధికి ఏపీటీడీసీ ప్రణాళిక

blue_flag_in_visakha
blue_flag_in_visakha (ETv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 4:19 PM IST

BLUE FLAG BEACH IN VISAKHA : పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యాటక రంగంపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సందర్శనీయ స్థలాలతో పాటు ప్రధానంగా విశాల సముద్ర తీర ప్రాంత అభివృద్ధిపై ఏపీ టూరిజం డెవల్‌ప్​మెంట్‌ కార్పొరేషన్‌ (APTDC) ఆధ్వర్యంలో దృష్టి సారించింది. విశాఖ పట్నంలో బీచ్​లకు సందర్శకులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్నామ్నాయంగా మరికొన్ని ప్రాంతాల్లో బీచ్​లను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు యారాడ బీచ్​ను బ్లూ ఫ్లాగ్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం సంకల్పించింది.

రుషికొండ ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ బీచ్‌ల అభివృద్ధికి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే యారాడ బీచ్‌ను ఏపీటీడీసీ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులు యారాడ వైపు మళ్లేలా "బ్లూ ఫ్లాగ్‌" ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. సందర్శకులకు అవసరమైన సౌకర్యాల కల్పన, రెస్టారెంట్‌ నవీకరణ పనులు చేపట్టాలని, అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రయాణం కష్టమే కానీ కళ్లు చెదిరే అందాలు - ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం

యారాడ వద్ద తీరాన్ని ఆనుకొని ఉన్న అగ్రి గోల్డ్‌ సంస్థ ఖాళీ స్థలాల్లో చిన్నపాటి పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీటీడీసీ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో పర్యాటక సమాచార కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ కేంద్రం అందుబాటులోకి వస్తే ఏపీటీడీసీ ప్యాకేజీలు, సందర్శనీయ ప్రాంతాల సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అదే విధంగా జిల్లాలో చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న పర్యాటక భవన్‌ను నిర్మించాలనే ప్రతిపాదనపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. తాజాగా దాన్ని పునరుద్ధరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు రుషికొండ బీచ్‌లో ఏపీటీడీసీ పడవలతో పాటు మరికొన్ని అదనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు విశాఖ కేంద్రంగా ట్రాన్స్‌పోర్టు యూనిట్‌ ఆధ్వర్యంలో కొత్త బస్సులు, వాహనాల కొనుగోలుకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయి.

విశాఖ నగరం నడిబొడ్డున పలు ప్రాంతాల్లో తమ ఆధీనంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీటీడీసీ భావిస్తోంది. వాటిల్లో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో కొన్ని చోట్ల, మిగిలిన చోట్ల పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య) విధానంలో చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రుషికొండ బ్లూఫ్లాగ్‌ బీచ్‌ పర్యవేక్షణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీ గడువు పూర్తవడంతో ఇక ఏపీటీడీసీ చేపట్టనుంది. గతంలో ఈ బీచ్‌ నిర్వహణపై ఉన్నటువంటి ఆరోపణలకు తావులేకుండా చేయాలని నిర్ణయించింది.

స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!

చాలెంజ్ : "బాహుబలి గ్రాఫిక్స్​ను మించిపోయేలా!" - మీ కళ్లను మీరే నమ్మలేరు!

పాడేరుకు పోదాం- ఎయిర్ బెలూన్​లో విహరిద్దాం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.