Sunkishala Retaining Wall Collapsed at Nagarjuna Sagar :నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్టు మారే సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలి క్షణాల్లో పంప్‌హౌస్ జలదిగ్భందమైంది. హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం సుంకిశాల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటెయినింగ్ వాల్ నిర్మించారు. రిటెయినింగ్ వాల్ కూలడంతో సుంకిశాల పంపుహౌస్ నీట మునిగింది.
Heavy Flood Water Flow To Nagarjuna Sagar :మరోవైపు నాగార్జునసాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 11 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదప్రవాహం - Telangana irrigation projects
ఇక శ్రీశైలం జలశయానికి కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగులు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 3.08 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.60 అడుగులకు చేరింది.