తెలంగాణ

telangana

ETV Bharat / state

శివాలయంలో అద్భుత దృశ్యం - శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు - ఎక్కడంటే? - SUNRAYS TOUCHING SHIVA LINGAM

సూర్యాపేట జిల్లాలో శంబూ లింగేశ్వరాస్వామిని తాకిన సూర్యకిరణాలు - మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందు కిరణాలు తాకడం విశేషం - సూర్యకిరణాలు పడే సమయంలో శివ లింగాన్ని దర్శించుకున్న భక్తులు

Sunrays Touching Shiva Lingam
Sunrays Touching Shiva Lingam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 1:50 PM IST

Sunrays Touching Shiva Lingam :సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో ఉన్న శ్రీ స్వయం భూ శంబూలింగేశ్వర స్వామిని సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యాలు భక్తులను కనువిందు చేశాయి. లేలేత సూర్యకాంతులతో స్వయం భూ శంబు లింగేశ్వర స్వామి వారు కాంతులీనారు. మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందే స్వామివారిని సూర్యకిరణాలు తాకడం విశేషం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారిని సూర్యకిరణాలు తాకినట్లుగా ఆలయ అధికారులు వివరించారు.

సూర్యకిరణాలు పడుతున్న సమయంలో దర్శించుకుంటే :సూర్య కిరణాలు శివలింగంపై పడుతున్న సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని ఆలయ పండితులు వివరించారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు తెలిపారు. మహాశివరాత్రికి మరో నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు భక్తులు ఆలయానికి వచ్చి శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details