ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో భానుడి భగభగలు- ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక - Heat waves in Several Districts - HEAT WAVES IN SEVERAL DISTRICTS

Summer Heat Waves in Andhra pradesh:రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో అధిక వేడి పెరుగుతోంది. గురువారం ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (Temperatures) 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Summer_Heat_Waves_in_Andhra_pradesh
Summer_Heat_Waves_in_Andhra_pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 1:05 PM IST

Summer Heat Waves in Andhra pradesh:రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదుకానుంది. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలవుతుంది. దీంతో వృద్ధులు, పిల్లలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, బయటకు వచ్చిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

భానుడి భగభగ - రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం - Summer Heat Waves in AP

Heat waves in Several Districts:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరిపోవటంతో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.అత్యధికంగా కడప జిల్లా వేమనపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా పల్నాడు జిల్లా దుర్గిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. ప్రకాశంలో 41 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా కోటవరుట్లలో 40.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో40.21 డిగ్రీల నమోదు అయ్యింది. మన్యం జిల్లా, విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలతో పాటు, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ, పార్వతీపురం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 11 నుంచి 4 గంటల వరకూ ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది. తీవ్రమైన వేడి గాలులకు వడదెబ్బ తగిలే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

భానుడి భగభగ - రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం - Summer Heat Waves in AP

ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పులు తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్​ఫోన్లకు హెచ్చరికల సందేశాలు పంపాలని నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేయనున్నట్టు కూర్మనాథ్ తెలిపారు. గత ఏడాదిలోనూ గరిష్ఠంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్ల సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్తు సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.

ఎండలు పెరుగుతున్నాయి- ఈ నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు?: వాతవరణ శాఖ

ABOUT THE AUTHOR

...view details