AP Government on Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. ఈ ఉదయం చంద్రబాబు తిరుపతికి వెళ్లి తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులంతా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత, మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ హుటాహుటిన తిరుపతికి బయలుదేరారు.
అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా?: భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ప్రశ్నించారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ఆయన డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి లాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులు సీఎంకు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని స్పష్టం చేశారు. విశాఖలో కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. మరి కొందరి…
— N Chandrababu Naidu (@ncbn) January 8, 2025
మెరుగైన వైద్యం అందించాలి: తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మృతుల కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసిందన్న పవన్ కల్యాణ్, వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది
— JanaSena Party (@JanaSenaParty) January 8, 2025
•మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన…
అత్యంత బాధాకరం: తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రుయా ఆసుపత్రి అత్యవసర సేవల విభాగం వద్ద పరిస్థితులను అదుపు చేయాలని సూచించారు. తిరుపతి ఘటన ప్రమాదమా, కుట్రా అనే కోణంలో విచారణ చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఎవరి వైఫల్యం ఉందో అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు. తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట ఘటన మనసును కలచివేసింది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా భక్తుల మధ్య తోపులాటలో నలుగురు భక్తులు మరణించడం చాలా బాధాకరం. భక్తితో ఏడుకొండల స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో ఇలా జరగడం దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనలో…
— Anitha Vangalapudi (@Anitha_TDP) January 8, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తిరుపతి ఘటనపై మోదీ, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి - అధికారులపై సీఎం ఆగ్రహం