Few Techniques to Improve Study Skills : ఎంత చదివినా చదివింది గుర్తుండట్లేదా ? ఎన్ని పరీక్షలు రాసినా మంచి స్కోరు రావడం లేదా ? ఎలా చదవాలో ఏ పద్ధతిలో చదవాలని తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారా ? అయితే కింద ఉన్న ఈ టెక్నిక్లను అలవాటు చేసుకుని మీ అధ్యయన పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. ఈ టెక్నిక్స్‌తో మీ గ్రేడ్‌లను మెరుగుపరుచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ స్టడీ స్కిల్స్ పెంచుకోవడంతో ఉపయోగపడే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందామా.
- మైండ్ మ్యాపింగ్ :స్టడీ స్కిల్స్‌ను మెరుగుపరచడంలో మైండ్ మ్యాపింగ్ అనేది గొప్ప సాధన. పుస్తకంలోని కాన్సెప్ట్‌లను, మీ ఆలోచనలను అనుసంధానం చేసే విజువల్ రేఖాచిత్రాల రూపకల్పనే మైండ్ మ్యాపింగ్ పద్ధతి. దీన్ని అలవాటు చేసుకుంటే పాఠ్యాంశాల మధ్య సంబంధాలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ కాలం కూడా గుర్తుండేలా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
2.రంగుల కోడ్ నోట్స్ :నోట్స్ రాసే సమయంలో వివిధ కలర్స్ ఉపయోగించడం ద్వారా విజువల్ లెర్నర్స్ సమాచారాన్ని గుర్తించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన టాపిక్‌ను కలర్ కోడింగ్ చేయడంతోపాటు అధ్యయనాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది.
3. గ్రూప్ స్టడీ సెషన్‌లూ : ఎప్పుడు ఒంటరిగా కాకుండా తోటి విద్యార్థులతో గ్రూప్‌గా ఒకరికొకరు సహకరించుకుంటూ, అర్థం కాని టాపిక్‌లను షేర్ చేసుకోవడం వల్ల సులభంగా నేర్చుకోగలుగుతారు. ఈ అలవాటును పెంపొదించుకుంటే అధ్యయన ప్రక్రియలోను గణనీయమైన పురోగతి కనబడే అవకాశం ఉంది.
4. ఎడ్యుకేషనల్ వీడియోలు, చదువుకు సంబంధించిన డాక్యుమెంటరీలను చూడటం వల్ల వివిధ అంశాలపై కొంత మేరకు అవగాహన పెరుగుతుంది. కొత్త కాన్సెప్టులు సైతం తెలుస్తాయి. ఆయా సబ్జెక్టులపై స్పష్టమైన అవగాహన కూడా పెరుగుతుంది.