Students Walked 18 km And Complained to The Collector On Principal :తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 200 మంది ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ తమను వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు మంగళవారం పాఠశాల, కళాశాల ప్రహరీ దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టరేట్‌కి 18 కి.మీ. పాదయాత్ర ద్వారా చేరుకుని సమస్యలు విన్నవించుకున్నారు.
అ తర్వాత విద్యార్థులు (students) తాము ఎందుకు ఇలా బయటకు వచ్చింది చెప్తూ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ నిత్యం క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను వేధిస్తూ కొడుతున్నారని ఆరోపించారు. స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేయలేదని, విద్యాబోధన సక్రమంగా లేదన్నారు. గురుకులంలో విద్యార్థులందరికి మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో వారు బహిర్భూమికి చెట్లు, గుట్టల్లోకి పోతున్నామని విద్యార్థులు వాపోయారు. తమకు రోజూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. తమ సమస్యలు అన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికే విద్యార్థులంతా పాదయాత్రగా ఇక్కడి వచ్చామని తెలిపారు.