తెలంగాణ

telangana

ETV Bharat / state

డైనోసార్లు, ఆదిమానవులు, ఇంకా మరెన్నో - ఈ పార్కుకు వెళితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు! - ECOLOGICAL KNOWLEDGE PARK IN AP

పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఏపీలోని ఎకొలాజికల్‌ పార్కు - ఆదిమానవుల జీవన విధానాన్ని కళ్లకు కట్టే కళారూపాలు

Students Must Visit Ecological Knowledge Park
Students Must Visit Ecological Knowledge Park (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 12:00 PM IST

Students Must Visit Ecological Knowledge Park :మనం సమయం దొరికితే పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని, కొత్త కొత్త ప్రదేశాలు వెళ్లి అక్కడ ఉన్న అందమైన ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటాం. ఏపీలో ఉన్న ఈ ప్రదేశానికి కుటుంబంతో కలిసి వెళితే ఆనందంతో పాటు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే జ్ఞానం, కొత్త విషయాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అదే ఎకొలాజికల్‌ పార్కు. ఈ సంక్రాంతి సెలవులకు ఎకొలాజికల్‌ పార్కుకు వెళితే మీ పిల్లలు పుస్తకాల్లో చదివిన, విన్న పాఠాలు వారి కళ్ల ముందే దర్శనమిస్తాయి. పూర్తి వివరాల్లోకి వెళితే

ఎకొలాజికల్‌ పార్కు (ETV Bharat)

పర్యావరణ మార్పులను కళ్లకు కట్టేలా రూపకల్పన :ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి కర్నూలు జిల్లా సున్నిపెంటలోని ఎకొలాజికల్‌ పార్కు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ పార్కును 2011- 2012లో ఏర్పాటు చేశారు. వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు భూమిపై చోటు చేసుకున్న పర్యావరణ మార్పులను కళ్లకు కట్టేలా ఈ పార్కును రూపకల్పన చేశారు. ఎకొలాజికల్‌ పార్కులో భారీ డైనోసార్లు, వివిధ రకాల జంతువుల బొమ్మలు ఏర్పాటు చేశారు. అలాగే వాటి జీవిత విశేషాలను వివరించారు. ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా బొమ్మలుగా అమర్చి, వాటి చరిత్రను అందరికీ అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాశారు.

ఎకొలాజికల్‌ పార్కు (ETV Bharat)

ఆది మానవుల జీవన విధానం :ఎకొలాజికల్‌ పార్కులో బిగ్‌ బ్యాంగ్‌ మొదలుకొని, ఆది మానవుడి జీవనం వరకు జీవ పరిణామ క్రమాన్ని ఇక్కడ చూడవచ్చు. ఆది మానవుడి జంతువులను ఎలా వేటాడి వాటిని ఆహారంగా ఎలా తీసుకున్నాడు అనే విషయాలను వివరించారు. ఆది మానవుల జీవన విధానాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన బొమ్మలు చిన్న పిల్లలను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ఆదిమానవుల జీవన విధానాన్ని కళ్లకు కట్టే కళారూపాలు (ETV Bharat)

ఎకొలాజికల్‌ పార్కులో ఎనీ టెర్రాయిన్‌ వెహికల్‌ (ఏ - టీవీ) కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు స్థానిక ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులే కాకుండా శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులు, అలాగే పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తిలకిస్తున్నారు. ఎకొలాజికల్‌ పార్కు చాలా చూడముచ్చటగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆది మానవుడు (ETV Bharat)

ఇకపై రోడ్డు మార్గంలోనే అక్కమహాదేవి గుహకు - ఈ సెలవుల్లో ప్లాన్ చేయండి!

తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీ - ఒకేరోజు పంచారామాల దర్శనం - ధర కూడా తక్కువే!

ABOUT THE AUTHOR

...view details