తెలంగాణ

telangana

ETV Bharat / state

గొంతు విని పేరు చెప్పేస్తున్నారు - 400కు పైగా పక్షిజాతులను ఇట్టే గుర్తుపట్టేస్తూ అబ్బురపరుస్తున్న విద్యార్థులు - Kamareddy district latest news

Students Identify Different Types Birds in Kamareddy District : పాఠశాల విద్యార్థులంటే చదువు, క్రీడలు మాత్రమే అనుకుంటాం. కానీ ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్ర వహించే పక్షులను ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. రాష్ట్రంలోని 437 పక్షి జాతుల్లో, 400లకు పైగా పేర్లను క్షణాల్లో చెబుతూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.

Students Identify Different Types Birds in Kamareddy
Students Identify Different Types Birds in Kamareddy

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 12:11 PM IST

400కి పైగా పక్షుల జాతుల పేర్లను క్షణాల్లో చెబుతున్న విద్యార్థులు

Students Identify Different Types Birds in Kamareddy District : కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీబీపేట మండలం మాందాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఏ విద్యార్థికీ సాధ్యం కాని రీతిలో తమకు మాత్రమే సొంతం అనే విద్య ఒకటి సాధన చేశారు. తమ చుట్టూ ఉండే పక్షిని చూసి, దాని గొంతు విని వెంటనే అది ఏ పక్షి జాతికి చెందిందో చెబుతూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. అంతేకాదు జీవవైవిధ్య అధ్యయనం చేస్తూ పక్షులు లేకుంటే మానవ మనుగడ కష్టమని చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

Kamareddy Students Identify 400 Birds :విద్యార్థులను తీసుకొని ఉపాధ్యాయులు గతంలో ఓసారి అటవీ సందర్శనకు వెళ్లారు. అక్కడి అధికారులు వారికి అడవుల గొప్పతనం, జంతువులు, పక్షుల ప్రాముఖ్యత (Birds) వివరించగా, వారికి పక్షులపై ఇష్టం ఏర్పడింది. పక్షులు లేకుంటే మానవ మనుగడ లేదని గ్రహించారు. రైతన్నలకు అవే నేస్తాలంటూ ఉపాధ్యాయులు బోధించారు. అప్పటి నుంచి వారు పక్షుల పట్ల ఆసక్తి పెంచుకుని, వాటి వివరాలు సేకరిస్తూ అవగాహన పెంచుకుంటున్నారు.

Bird Walk in Forest: ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో బర్డ్‌వాక్‌.. చూద్దాం రారండోయ్‌!

పాఠశాల పరిసరాల్లోని నాలుగు చెరువుల వద్దకు వందల రకాల పక్షులు వస్తుంటాయి. అక్కడకి తరచూ వెళ్తున్న విద్యార్థులు, వాటిని చూసి అవగాహన తెచ్చుకుంటున్నారు. సుమారు 250 రకాల పక్షుల పేర్లను వారు అవలీలగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వీటి గురించి మరింత అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారు.

"మేము గత మూడు సంవత్సరాలుగా పక్షులను గుర్తిస్తున్నాం. గతంలో మా ఉపాధ్యాయులు కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు తీసుకెళ్లినప్పుడు అక్కడి అధికారులు పక్షులు, జంతువుల ప్రాముఖ్యతను వివరించారు. మా ఉపాధ్యాయులు ఆ అంశాలను మాకు వివరించారు. అంతే కాక పక్షుల వల్ల మానవులకు కలిగే ఉపయోగాలను తెలియజేశారు. అప్పటి నుంచి మాకు పక్షులపై ఇష్టం పెరిగి, వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నాం." - విద్యార్థులు

Different Types Birds in Telanagana :తెలంగాణలోని రామప్ప, లక్నవరం చెరువులు, వరంగల్‌లోని పాకాల జీవవైవిధ్య ఉద్యానవనం, జన్నారంలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతం, తమిళనాడు, కర్ణాటకలోని ప్రముఖ అటవీ క్షేత్రాలను సందర్శించారు. స్థానికంగా నిజామాబాద్‌ జిల్లాలోని సిరికొండ అటవీ ప్రాంతం, బీబీపేట పెద్ద చెరువులో పర్యటించి, సుమారు 200కు పైగా పక్షి జాతులను గుర్తించారు. బీబీపేట పెద్ద చెరువు ఎగువ భాగంలో సుమారు వందకు పైగా జాతులు (Different Types Birds) ఉన్నట్టు నిర్ధారించారు.

Birds Walk Festival: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పిట్టల నడక

పక్షులపై అవగాహనతో మరింత ముందుకెళ్లి జీవవైవిధ్య విభాగం అధ్యయనాలు చేసి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. 2022, 2023లో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 2023లో జాతీయ చిల్డ్రన్‌ కాంగ్రెస్‌ వైజ్ఞానిక విభాగంలో పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా నేర్చుకోవడం ఇబ్బంది కాదని మాందాపూర్‌ పాఠశాల విద్యార్థులు నిరూపిస్తున్నారు.

"గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు జీవవైవిధ్యంపై ఆసక్తిని పెంచుకున్నారు. పక్షులకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేస్తున్నారు. అంతరించిపోతున్న పక్షులను గుర్తిస్తున్నారు. వీటిపై అధ్యయనం చేసి జీవవైవిధ్య విభాగంలో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. మా పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చారు. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." - సారయ్య, ప్రధానోపాధ్యాయుడు

పక్షుల కోసం దీపావళి ఆనందం త్యాగం- 50 ఏళ్లుగా ఆ ఊర్లో ఇంతే!

పక్షుల కోసం ఏడంతస్తుల మేడ.. 512 ఫ్లాట్లతో టవర్​ నిర్మాణం.. ఎక్కడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details