Students Died after Falling into Reservoir :స్నేహితుల దినోత్సవం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తోటి విద్యార్థులతో సరదాగ గడపడానికి వెళ్లిన కొందరు యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటనలు విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
ప్రమాదవశాత్తు నీటిలో పడి: బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రమాదశవాత్తు నీటిలో పడి మృతి చెందిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన నిరంజన్(20) అనే యువకుడు గీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు(ఆదివారం) స్నేహితులు దినోత్సవం కావడంతో విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఉన్న గంభీరం జలాశయాన్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు.
గిరిజన సంక్షేమ హాస్టల్లో మరో విద్యార్థి మృతి - గత మూడేళ్లలో 40మంది మృత్యువాత - student died in Tribal Hostel
ఈ సమయంలో నిరంజన్ కాలుజారి అనుకోకుండా నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు. దీన్ని గమనించిన మరో ఇద్దరు స్నేహితులు నిరంజన్ను రక్షించేందుకు రిజర్వాయర్లోకి దూకారు. అయితే నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అందరూ నీటిలో చిక్కుకుపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే నిరంజన్ ఆచూకి తెలియక కాపాడలేక పోయారు. అనంతరం రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గంటల తరబడి శ్రమించి ఎట్టకేలకు నిరంజన్ మృతదేహన్ని బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడు మృతి చెందడంతో అక్కడికి చేరుకున్న తోటి స్నేహితులు భోరున విలపించారు.
స్నేహితులతో కలిసి సరదాగా :పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీలం నాగ శివ కార్తీక్(18) అనే యువకుడు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి తంగేడుపల్లి మేజరు కాల్వలో మునిగి మృతిచెందాడు. వివరాల్లోకి వెెళ్తే, ఈరోజు(ఆదివారం) సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా బుచ్చిపాపన్నపాలెం వద్ద ఉన్న తంగేడుపల్లి మేజరు కాల్వలో ఈతకు వెళ్లారు. రోడ్డు వంతెన వద్ద ఎగువవైపు ముగ్గురు స్నేహితులూ ఒకేసారి కాల్వలోకి దూకారు. కాస్త ఎగువన డ్రాపులు ఉండి నీళ్లు సుడులు తిరుగుతుండటంతో ముగ్గురూ అక్కడే చిక్కుకుని తిరుగుతున్నారు.
పండుగ వేళ పలుచోట్ల విషాదాలు - ఈతకు వెళ్లి ఆరుగురి మృతి - Four Youth Missing In River
ఈ క్రమంలోనే ఈత వచ్చిన మిగతా ఇద్దరూ ఒడ్డుకు చేరుకోగా నాగ శివ కార్తీక్ ఈత రాక కాల్వలో మునిగి మృతిచెందాడు. ఒడ్డుకు చేరిన స్నేహితులు కార్తీక్ బందువులకు ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి కార్తీక్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే నాగ శివ కార్తీక్ తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణకు ఆధారంగా మారాడు. పదో తరగతిలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో వాటిని చదువుకుంటూ పనులకు వెళుతున్నాడు. కొంతకాలం బైక్ మెకానిక్ దుకాణంలో పనిచేసి రెండు నెలల నుంచి రొంపిచర్లలోని బేకరీలో పనిచేస్తున్నాడు. నీటిలో పడి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో నాగశివ కార్తీక్ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది.
యువతకు సూచన : అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా న్యాయ సేవాధికర సంస్థ సివిల్ జడ్జి కె.విజయ కల్యాణి యువతకు పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యల నిషేధం, మోటార్ వాహన చట్టాలు, హెల్మెట్ పై అవగాహనా మొదలగు అంశాలపై విజయనగరం తిరుమల హాస్పిటల్ నుండి మయూరి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం పై తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ చూపాలన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు.
విషాదాన్ని నింపిన విహారయాత్రలు- ఈత కోసం దిగి ఐదుగురు విద్యార్థులు మృతి
స్నేహితుల దినోత్సవం రోజున విషాదం - ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విద్యార్థులు (ETV Bharat)