Street Vendors not Paying Lease to HMDA : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యాటకం జోరందుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నూతన సచివాలయం(Secretariat), అమరుల స్థూపంతో హుస్సేన్‌సాగర్ చుట్టూ మరింత పర్యాటకశోభ సంతరించుకుంది. వారాంతాల్లో వీటిని చూడటానికి వచ్చే పర్యాటకులతో ట్యాంక్‌బండ్ వద్ద రద్దీ గణనీయంగా పెరిగింది. వీరి రాకతో వీధి వ్యాపారులకు గిరాకీ బాగా పెరిగింది.
ఇంత గిరాకీ ఉన్నప్పటికీ దుకాణాదారులు లీజులు, అద్దెలు చెల్లించడం లేదు. గతంలో రాజకీయ పలుకుబడి, పైరవీలతో దుకాణాలు దక్కించుకున్న వారు ప్రస్తుతం అద్దెలు, లీజులు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నారు. అధికారులు అడిగితే గిరాకీ లేదంటూ బుకాయిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దుకాణాలకు సంబంధించి లీజుల గడువు ఇప్పటికే ముగిసినా, కొత్త టెండర్లు ఆహ్వానించకుండా వారినే కొనసాగించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Street Vendors Exploits HMDA Regulations : ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అద్దెలు, లీజులు చెల్లింపులో ఆలస్యంతో పాటు ఎగవేతకు పాల్పడుతున్న 35 సంస్థలకు తాఖీదులు జారీ చేసింది. వెంటనే బకాయిలు చెల్లించకపోతే అనుమతులు రద్దు చేస్తామని నోటీసులు పంపించింది. అయినప్పటికీ పలు సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో లీజు రద్దు దిశగా హెచ్‌ఎండీఏ అడుగులు వేస్తోంది.
సర్కారీ లే అవుట్లు - ఔటర్ చుట్టూ 924.28 ఎకరాల్లో అభివృద్ధికి ప్రభుత్వం సన్నాహాలు!
హుస్సేన్‌సాగర్ పరిధిలోని నెక్లెస్‌రోడ్డు, పీపుల్స్‌ప్లాజా, బుద్ధపూర్ణిమ, ట్యాంక్‌బండ్, జలవిహార్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్, పీవీఘాట్, సంజీవపార్కు తదితర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుంది. వారాంతాలైన శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో భారీగా సందర్శకులు వస్తుంటారు. ఈ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార దుకాణాలు 80 వరకు ఉన్నాయి. వీటి నిర్వహణకు హెచ్‌ఎండీఏ టెండర్ల ద్వారా ఏడాది నుంచి మూడేళ్ల టైం పీరియడ్‌తో లీజుకు అనుమతులు ఇస్తుంది.
మరికొన్నింటిని నెలవారీ అద్దె ప్రాతిపదికన కొనసాగిస్తుంటారు. ఏటా సదరు దుకాణాల నుంచి లీజులు, అద్దెల ద్వారా రూ.17 కోట్లుపైనే హెచ్‌ఎండీఏకు ఆదాయం వస్తోంది. అయితే గత కొంతకాలంగా లీజుల చెల్లింపులలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇక్కడున్న కొందరు వ్యాపారులు కొన్ని నెలలపాటు అద్దెలు చెల్లించడం లేదు. ఇంకొందరు వ్యక్తులు నాలుగైదు వ్యాపారాలు నిర్వహిస్తూ ఒకదానికి చెల్లించి మిగతా వాటికి మొండి చెయ్యి చూపుతున్నారు. కొన్ని సంస్థలు లీజుల గడువు ముగిసి రెండు, మూడేళ్లు అవుతున్నా ఏదో కారణంతో లీజు పొడిగిస్తూ నెట్టుకొస్తున్నారు. ఒకవైపు అసలు వ్యాపారమే లేదంటున్న వారు.. లీజుల గడువు ఎందుకు పెంచుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Lake Front Park Opening Hyderabad Today : హుస్సేన్‌సాగర్ వద్ద సరికొత్త అందాలు.. నేడే 'లేక్ ఫ్రంట్ పార్కు' ప్రారంభోత్సవం
హైదరాబాద్‌లో పై వంతెనలు, అండర్ పాస్‌లు.. సీఎం రేవంత్ ఆదేశాలు