తెలంగాణ

telangana

ETV Bharat / state

8 పదుల వయసులోనూ తగ్గేదే లే - అవ్వా నువ్వు సూపర్ అంతే! - STORY ON 85 YEARS OLD WOMAN

8 పదుల వయసులోనూ అవ్వ జోష్ - వ్యవసాయం చేస్తూ, ఎండ్ల బడి నడుపుతూ పలువురికి ఆదర్శం

Story on 85 years Old Woman in Adilabad
Story on 85 years Old Woman in Adilabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 11:41 AM IST

Story on 85 years Old Woman in Adilabad :ఎద్దుల బండిని నడిపిస్తున్న ఈ బామ్మ నిర్మల్‌ జిల్లా మామడ మండలం జగదాంబ తండాకు చెందిన ఆడె లక్ష్మీబాయి. ఈమెకు 85 సంవత్సరాలుంటాయి. ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మనవలు, మనవరాళ్లు పెద్ద బలగమే ఉంది. సాధారణంగా ఈ వయసు వారు వయోభారంతో ఇంట్లోనే ఉండిపోతారు. కానీ లక్ష్మీబాయి అలా కాదు, ఇప్పటికీ సాగు పనులు చూసుకుంటారు. ఏ మాత్రం భయపడకుండా ఎద్దుల బండినీ తోలుతారు.

ఆడె లక్ష్మీబాయి (ETV Bharat)

గట్టిదనపు రహస్యం ఏంటవ్వా? :ఆదివారం బడికి సెలవు కావడంతో పిల్లలను తీసుకుని ఇంటికి అవసరమైన మట్టిని చేలో నుంచి తీసుకొచ్చేందుకు ఇలా ఎడ్ల బండి మీద బయలుదేరారు. అంతేనా తవ్విన పసుపును మండ నుంచి కొమ్మును వేరు చేసే పనిని కూర్చున్న చోట చేస్తుంటారు. మళ్లీ అప్పుడప్పుడు పత్తి ఏరేందుకు వెళ్తుంటారు. 'అవ్వా ఈ వయసులో కూడా ఇన్ని పనులు చేస్తుంటారు, ఏంటీ మీ గట్టిదనపు రహస్యం అంటే? ఏముంది బిడ్డా! జొన్నరొట్టే - మక్క గట్క' తినేవాళ్లం అని అన్నారు. అన్ని పనులు చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు ఉండడంతో ఇప్పటికీ ఇలానే ముందుకెళ్తున్నానని ఉత్సాహంగా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details