తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేం అంగీకరించని విషయాలను మినట్స్​లో పొందుపర్చారు - వాటిని సవరించండి'

state Government Writes Letter to Central on Krishna Board Projects : కృష్ణా నదీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో తాము అంగీకరించని విషయాలను మినట్స్​లో చేర్చారని, వాటిని వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. జనవరి 17న దీల్లీలో జరిగిన మీనట్స్​ సమావేశంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

State Government Writes Letter to Central on Krishna Board Projects
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ - మినట్స్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సూచన

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 9:37 PM IST

State Government Writes Letter to Central on Krishna Board Projects :కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో తాము అంగీకరించని విషయాలను మినట్స్​లో పొందుపర్చారని, వెంటనే వాటిని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జనవరి 27వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 17 దిల్లీ సమావేశం మినట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ, ఆ రోజు సమావేశంలో రాష్ట్ర ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోలేదని పేర్కొంది.

రాష్ట్రం అంగీకారం తెలపకముందే అంగీకరించినట్లు మినట్స్ లో పొందుపర్చారని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చించి తాము చెబుతామన్నామని, అయితే కాంపోనెంట్ల స్వాధీనానికి అంగీకరించినట్లు పేర్కొనడం సబబు కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మినట్స్​ను సవరించాలని కోరింది. ప్రాజెక్టుల స్వాధీనానికి ఆపరేషన్ ప్రోటోకాల్స్ కీలకమని, అది లేకుండా స్వాధీనం సాధ్యం కాదన్న తమ అభిప్రాయాన్ని పొందుపర్చలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విభజన చట్టం ప్రకారం జలవిద్యుత్ ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాలే నియంత్రించాల్సి ఉంటుందని, ఈ రెండు విషయాలను మినట్స్​లో పొందుపర్చాలని కోరింది.

State Government Letter about Minutes Meeting : ట్రైబ్యునల్ కేటాయింపులు తేలే వరకు కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు చెరి సగం వాటా, బేసిన్ అవసరాలకు ప్రాధాన్యం, శ్రీశైలంలో కనీస నీటి వినియోగ మట్టం 830 అడుగులు ప్రోటోకాల్​లో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోరాదని, తాగునీటిని 20 శాతంగా లెక్కింపు, క్యారీ ఓవర్ జలాల వినియోగం, బేసిన్ వెలుపల అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనులు చేపట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.

ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు తర్వాతే ప్రాజెక్టుల స్వాధీనాన్ని పరిశీలించాలని, ఈ అంశాన్ని ఏపెక్స్ కౌన్సిల్​కు నివేదించాలని దిల్లీలో జరిగిన సమావేశంలో కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్​కు సవరణలు చేయాలని కోరామని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమవైపు సీఆర్పీఎఫ్ బెటాలియన్ అవసరం లేదని స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో తమ షరతులను పరిగణలోకి తీసుకోవాలన్న తెలంగాణ, మినట్స్​ను సవరించాలని కోరింది.

'కృష్ణా బోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, సాగర్‌ డ్యాంలపైకి ఇరు రాష్ట్రాల అధికారులకు అనుమతి'

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

ABOUT THE AUTHOR

...view details