ETV Bharat / state

శ్రీవారి భక్తులకు కంకణం కట్టాల్సిందేనా? - 2 గంటల్లోనే దర్శనం కావాలంటే తప్పదా? - TTD PLANS TO REDUCE DARSHAN TIME

సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం - వీలైనంత త్వరగా శ్రీనివాసుని దర్శనం కల్పించే యోచన

TTD Plans To Reduce Darshan Time
TTD Plans To Reduce Darshan Time (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 7:29 PM IST

Updated : Nov 18, 2024, 7:45 PM IST

TTD Plans To Reduce Darshan Time : కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఇందుకోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 స్పెషల్​ దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్‌ దర్శనం, సర్వదర్శనం అని పలు రకాలుగా ఉన్నాయి. అయితే భక్తుల్లో అత్యధికులు సామాన్యభక్తులే.

భక్తుల రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూకాంప్లెక్స్‌లోనే దాదాపు 30 గంటలు శ్రీవారి దర్శనం కోసం వేచిచూడాల్సి వస్తోంది. స్లాట్‌ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణునివాసంలో ఆధార్‌ ఐడీ ద్వారా దర్శన సమయాన్ని కేటాయిస్తారు. దీంతో రెండు, మూడు గంటల్లోనే దర్శనం కంప్లీట్​ అవుతుంది. అయితే ఈ రకమైన టికెట్లు పరిమితమే. అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి కాలి నడకన వచ్చే భక్తులకు గతంలో దివ్యదర్శనం పేరుతో కొన్ని టికెట్లను కేటాయించేవారు. ఇందులో భాగంగా 2, 3 గంటల్లోనే తిరుమలేశుని దర్శనం పూర్తయ్యేది. అయితే గత సర్కారు దీన్ని రద్దు చేసింది.

ఐవీ సుబ్బారావు విధానం ‘కంకణం’

  1. 20 ఏళ్ల కిందట ఐవీ సుబ్బారావు ఈవోగా ఉన్న సమయంలో కంకణాల విధానాన్ని ప్రవేశపెట్టారు.
  2. ఈ విధానం ప్రకారం ప్రతి భక్తుడికి చేయికి రిస్ట్‌బాండ్‌ తరహాలో ఒక కంకణాన్ని ట్యాగ్‌ చేస్తారు. ఈ కంకణం వాటర్‌ప్రూఫ్‌తో ఉంటుంది.
  3. దీన్ని తిరుపతిలోని పలు కేంద్రాలతో పాటు రేణిగుంట తదితర ప్రాంతాల్లో వేసేవారు. ఈ విధానంతో మనకు కేటాయించిన సమయానికి వెళ్లి రెండు, మూడు గంటల్లోగా దర్శనం చేసుకొని తిరిగిరావచ్చు.
  4. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఈ అంశాన్ని గతంలో ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే ఛాన్స్​ ఉంది.

లఘుదర్శనంపై

  • 30 ఏళ్ల క్రితం వరకు సామాన్యభక్తుడు కూడా మూలవిరాట్‌ని అత్యంత సమీపంగా అంటే కులశేఖరపడి వరకు వెళ్లి దర్శనం చేసుకునేందుకు అవకాశముండేది. ప్రస్తుతం మాత్రం వీఐపీలు, రూ.10,500 దర్శనాలకు మాత్రమే అక్కడివరకు అనుమతినిస్తున్నారు.
  • తదనంతర కాలంలో లఘుదర్శనం అని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం గరుడాళ్వార్‌ సన్నిధి నుంచి జయవిజయులను దాటి స్వప్న మండపం వరకు వెళ్లి భక్తులు దర్శించుకునేవారు.
  • తరువాత ఈ విధానాన్ని కూడా రద్దు చేసి గరుడాళ్వార్‌ సన్నిధి నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. దీనికి మహాలఘు దర్శనంగా వ్యవహరిస్తున్నారు.

కనీసం లఘు దర్శనం కల్పిస్తే శ్రీనివాసుని సన్నిధిలో ప్రవేశించామన్న ఆనందానుభూతి భక్తులకు కలుగుతుంది. దీన్ని టీటీడీ పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్ - ఆ దర్శన టికెట్ల కోటా పెరిగింది

తిరుమల శ్రీవారి దర్శనానికి అన్ని నెలల నిరీక్షణా! - ఇదే పద్దతి గోవిందా?

Last Updated : Nov 18, 2024, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.