Complaint On Suvarna Bhoomi Infra Developers MD : సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సీసీఎస్‌లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్‌వేర్, విశ్రాంత ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేశారని వాపోయారు. ఏడాదిన్నర తర్వాత 24 శాతం అధికంగా చెల్లిస్తామని తెలిపారని బాధితులు వెల్లడించారు. స్కీమ్ కాలవ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో కోరారు.
బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరట : బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి కోటి రూపాయలను సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ వసూలు చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదిన్నర తరువాత ఇన్వెస్ట్‌మెంట్‌పై అధిక వడ్డీ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారని బాధితులు వెల్లడించారు. స్కీం కాలపరిమితి దాటినప్పటికీ తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు కోసం ఆఫీస్‌కు వెళితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మహిళా బాధితులు వాపోయారు. మూడేళ్లు అయినప్పటికీ చెల్లని చెక్కులు ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు. ప్రముఖ హీరోలతో సంస్థ పేరును ప్రమోట్ చేయడం వల్ల నమ్మి మోస పోయామయమని బాధితులు వాపోయారు. సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్, దీప్తిలపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సీసీఎస్ పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులు కోరారు.
"నేను 2023లో సువర్ణభూమి ఇన్‌ఫ్రా సంస్థలో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాను. నాకు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.60 లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉంది. నా భర్తకు న్యూరో సమస్య ఉంది. సర్జరీ చేయించడానికి అమౌంట్ అవసరముందని చెప్పి నా డబ్బులు ఇవ్వాలని గత 15 రోజులుగా వారి ఆఫీసు చుట్టు తిరుగుతున్నాను. కానీ వారు కనీసం స్పందించడం లేదు" - బాధితురాలు
రూ.17 లక్షలు ఇస్తే ప్రతి నెలా 30 వేలు, బోనస్‌గా 267 గజాల ప్లాట్!
రూ.లక్ష పెట్టుబడికి రూ.లక్ష లాభం - రూ.229 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు