State Dam Safety Officials Visit Barrages : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం పరిశీలించింది. జయశంకర్ భూపాల జిల్లా మహదేవపూర్ మండలంలోని బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. నీటి పారుదల శాఖ(Irrigation Department) ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్, రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం మొరం రాములు, దేశాయ్‌తో పాటు పలువురు సాంకేతిక, ఇంజినీరింగ్ నిపుణుల బృందం పరిశీలించారు. ముందుగా అన్నారం బ్యారేజీకి చేరుకొని, అక్కడ ఏర్పడిన సీపేజీ బుంగలను చూసింది.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
బ్యారేజీ దిగువకు వెళ్లి బ్లాక్ నంబర్ 4 లో 38, 39 మధ్య గల వెంట్ వద్ద ఏర్పడిన కొత్త బుంగను పరిశీలించారు. గత నవంబర్‌లో ఏర్పడ్డ 28, 38, 43 పియర్ల వద్ద ఏర్పడిన బుంగల పరిస్థితిపై ఆరా తీసారు. వాటిని గ్రౌటింగ్ చేశామని సీఈ సుధాకర్ రెడ్డి, ఈఈ యాదగిరి వారికి వివరించారు. పూర్తి స్థాయిలో నియంత్రణ జరిగిందని తెలిపారు. సీపేజీ బుంగలను మరమ్మతులు చేసిన రసాయన పదార్థాలను(Chemical Substances) ఏ విధంగా అప్లై చేశారు. ఎన్ని మార్లు చేశారని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు.
Safety Officials Visit to Kaleshwaram Project :వెలాసిటీ, గేట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంట్ వద్ద వేసిన ప్లాట్‌ఫామ్ పూర్తిగా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యారేజీకి సంబంధించి గేట్ల కింది భాగంలో సిమెంట్ పెచ్చులు ఊడిని విషయాన్ని అడిగారు. 66 గేట్లకు గాను 42వ పిల్లర్ వద్ద సిమెంట్ పెచ్చులు లేచిపోయినట్లు ఇంజినీరింగ్ అధికారులు(Engineering Officers) వివరించారు. తదుపరి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని ఏడో బ్లాక్‌లో దెబ్బతిని, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బ్యారేజీపై వంతెన రహదారి కిందకు కుంగడంతో కాలినడకన వెళ్తూ పరీక్షించారు.