తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్ ​డీలర్​ స్టాన్లీ విచారణలో వెలుగులోకి కొత్తకోణం - Drug Dealer Stanley Case Details

Stanley Drugs Case Update : పోలీసులు చేపట్టిన డ్రగ్స్​ డీలర్​ స్టాన్లీ విచారణలో మరో ఆసక్తికర కోణం వెలుగుచూసింది. గోవా కేంద్రంగా డ్రగ్ర్ దందా నిర్వహించే ఓక్రాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రస్తుతం గోవా జైలులో ఉన్న ఓక్రాను కూడా పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విచారించాలని టీన్యాబ్ అధికారులు భావిస్తున్నారు.

Stanley Drugs Case Update
డ్రగ్స్ ​డీలర్​ స్టాన్లీని విచారించిన పోలీసులు - మరో నిందితుడు ఓక్రాను కూడా విచారించే అవకాశం !

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 10:39 PM IST

Stanley Drugs Case Update : మాదకద్రవ్యాల కేసులో కస్టడీకి తీసుకున్న అంతర్జాతీయ నేరస్థుడు ఇవాకా ఉడొక స్టాన్లీని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఐదు రోజుల పాటు కోర్టు అనుమతితో అతణ్ని కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు మొదటిరోజు కస్టడీలో విచారించారు. మరో నాలుగు రోజుల పాటు అతని విచారణ కొనసాగనుంది. అతని వద్ద నుంచి టీన్యాబ్‌ పోలీసులు 8 కోట్ల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అయితే స్టాన్లీ మత్తు పదార్ధాలను ఎక్కడ నుంచి తెప్పిస్తున్నాడు, ఇంకా ఎవరిరెవరి పాత్ర ఇందులో ఉంది, ఎవరెవరికీ సరఫరా చేసేవాడు అనే అంశాలపై పోలీసులు అతణ్ని విచారిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో మరో కీలక నిందితుడు ఓక్లా వ్యవహారం కూడా బయటపడినట్టు సమాచారం. ప్రస్తుతం ఓక్రా డ్రగ్స్‌ కేసులో అరెస్టై గోవా కోల్వాలే జైలులో ఉన్నాడు. స్టాన్లీ చెబితే ఓక్రా జైలు నుంచే ఫోన్‌ ద్వారా నెదర్లాండ్‌ నుంచి మాదకద్రవ్యాలు తెప్పిస్తున్నట్టు విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. పోలీసులు ఓక్రాను కూడా పీటీ వారెంట్​పై తీసుకొచ్చి విచారించాలని భావిస్తున్నారు. మత్తు పదార్ధాలను పుణెలో తీసుకుని వాటిని సౌరవ్‌ అనే వ్యక్తి తరలిస్తున్నట్టు బయటపడింది. సౌరవ్‌ కోసం టీన్యాబ్‌ పోలీసులు గాలిస్తున్నారు.

Drug Dealer Stanley Case Full Details : ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు, ఇంట్లో 75 ఇంచ్‌ల టీవీ, లగ్జరీ జీవితం గడుపుతున్నాడు ఇవాకా ఉడొక స్టాన్లీ. బట్టల వ్యాపారం నుంచి మొదలు పెట్టిన ఉడొక స్టాన్లీ, ప్రస్తుతం అధికారులకు లంచాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. డ్రగ్స్ దందాలో కమీషన్లు పోనూ స్టాన్లీ ఏడాదికి సుమారు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎస్సార్​నగర్​ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తూ చిక్కిన ఇద్దరు నిందితులను ఆరా తీయగా గోవాలో బాబా అనే వ్యక్తి నుంచి కొన్నట్లు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసిన సమయంలో స్టాన్లీ వ్యవహారం బయటపడింది.

అయితే గోవా కొల్వాలే సెంట్రల్ జైళ్లో సెల్‌ ఫోన్ల విక్రయం, అక్కడి నుంచి సాగుతున్న డ్రగ్స్ దందాపై టీన్యాబ్ పోలీసులు అక్కడి అధికారులకు గతంలోనే సమాచారం ఇచ్చారు. తనఖీలు చేసిన సమయంలో చాలా సెల్‌ఫోన్లు పట్టుపడినట్లు సమాచారం. స్టాన్లీ మత్తు దందాలో గోవాలో మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోందని టీన్యాబ్ పోలీసులు తెలిపారు.

కమీషన్​ కోసం పనిచేసే స్థాయి నుంచి మత్తుదందాలో కింగ్​ స్థాయికి - స్టాన్లీ స్టోరీ 'పుష్ప'కు ఏమాత్రం తీసిపోదుగా!

డ్రగ్ కేసులో హీరో రాజ్​ తరుణ్ ప్రేయసి - రిమాండ్ రిపోర్ట్​లో పలు కీలక అంశాలు

ABOUT THE AUTHOR

...view details