తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీ సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి - ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎస్​ - Sri Rama Navami Festival 2024 - SRI RAMA NAVAMI FESTIVAL 2024

Sri Rama Navami Festival In Bhadradri : శ్రీరాముడి కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. కాగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. స్వామివార్ల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపై స్పష్టత రావాల్సి ఉంది.

Sri Rama Navami Festival In Bhadradri
Sri Rama Navami Festival In Bhadradri

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 2:51 PM IST

Sri Rama Navami Festival In Bhadradri : భద్రాద్రిలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు(Sri Rama Navami Brahmostavam) వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. రేపు మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. ఇందు కోసం మిథిలా మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. మరోవైపు స్వామివార్ల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపైఈసీ ఇంకా స్పష్టమైన నిర్ణయం చెప్పలేదని కలెక్టర్‌ ప్రియాంక తెలిపారు.

తలంబ్రాలు సమర్పించనున్న సీఎస్ : భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికిరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతి కుమారి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంక్షలు పాటిస్తూ సీతారాముల చంద్ర స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.

Permission On Live Broadcasts :స్వామివార్ల కల్యాణం ప్రత్యక్ష ప్రసారాలకు(live streams) ఈసీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(State Govt) తరఫున ఎన్నికల సంఘాన్ని ప్రసారాలకు అనుమతివ్వాలని అభ్యర్థించామన్నారు. ఈ సాయంత్రానికి వాటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ చర్యల ద్వారా భక్తకోటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని దేవాదాయ శాఖ(Endowment Commissioner)కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

15000 Devotees Reached Bhadradri :భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ(Kalyanam) మహోత్సవాన్ని తిలకించడానికి 15వేల మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించడానికి పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాల నుంచి భక్తులు(Devotees) సీతారాముల కల్యాణ మహోత్సవానికి పాదయాత్ర చేస్తూ వస్తున్నారు.

గత ఐదు రోజుల నుంచి సుమారు 200 కిలోమీటర్ల మేర భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి కదిలి వస్తున్నారు. ఒకవైపు పెరిగిన ఎండలు, మరోవైపు పాదాలకు పాదరక్షలు కూడా లేకుండా నడుచుకుంటూ స్వామివారి కల్యాణానికి భద్రాచలం చేరుకుంటున్నారు.

భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు.. TSRTC డోర్ డెలివరీకి అనూహ్య స్పందన

రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం : భద్రాచలం వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం అధికారులు(Temple Officials) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కదిలి వచ్చే భక్తులకు ఆలయ ఈవో రమాదేవి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఉచిత భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి ధరించాలని అధికారులు కోరారు.

భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్​న్యూస్​ - నవమి రోజు అందరికీ ఫ్రీ దర్శనం - Bhadradri Ramaiah Free Darshan 2024

శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి

ABOUT THE AUTHOR

...view details