తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తి కీర్తనలతో హైదరాబాద్‌ అమ్మాయి పాపులర్‌ - ఇన్‌స్టాలో 26 లక్షల మంది ఫాలోవర్స్

భక్తి కీర్తనలతో అదరగొడుతున్న హైదరాబాద్ అమ్మాయి - తక్కువ సమయంలోనే లక్షలాది మంది ఫాలోవర్లు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Popular Insta Influencer Shree Naval Kishori
Popular Insta Influencer Shree Naval Kishori (ETV Bharat)

Popular Insta Influencer Shree Naval Kishori :నుదుటన తిలకం, మెడలో పూసల దండ, అల్లికల జుట్టు, పాడేవి శ్లోకాలు. ఇలా సోషన్‌ మీడియాలో కంటెంట్‌ చేస్తే ఎవరైనా చూస్తారా అంటే సందేహపడతారు. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ, డైలాగ్స్‌ చెప్తుంటే రీల్స్‌ ఫేమస్ అవుతాయని భావిస్తారు. కానీ అవేమీ అక్కర్లేదని భక్తి శ్రద్ధలతో, హావభావాలతో భక్తిరస కీర్తనల వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ పేరు సంపాదించుకుంది ఆ అమ్మాయి.

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 26 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌ పేజీని వేలాది మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో లక్షన్నర మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన భక్తి కీర్తనలకు లక్షల్లో వ్యూస్‌ ఉన్నాయి. యాపిల్ మ్యూజిక్‌, స్పాటిఫైల్లోనూ తన పాటలతో అలరిస్తోంది. విష్ణు సహస్రనామాలు, కాలభైరవాష్టకంతో భక్తికీర్తనలతో తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యింది హైదరాబాద్ అమ్మాయి శ్రీకిషోరి.

ABOUT THE AUTHOR

...view details