ETV Bharat / entertainment

ఒకే ఫ్రేమ్​లో రజనీ, సూర్య, ప్రభాస్ - ఎందుకంటే? - KANGUVA SURIYA

ఒకే వేదికపై సందడి చేయనున్న పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​, సూపర్ స్టార్​ రజనీ కాంత్​, హీరో సూర్య!

Rajinikanth Suriya Prabhas
Rajinikanth Suriya Prabhas (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 3:54 PM IST

Suriya Kanguva Prabhas Rajinikanth : సాధారణంగా ఇతర హీరోల సినిమా ఈవెంట్స్​లో చాలా తక్కువగా కనిపిస్తారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఉంటే లొకేషన్​లో, లేదంటే విదేశాలకు ఆయన వెళ్లిపోవడం చేస్తుంటారు. అయితే ఇప్పుడాయన ఓ సినిమా ఈవెంట్​ కోసం బయటకు రాబోతున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కంగువా ప్రమోషన్స్​లో ప్రభాస్ పాల్గొంటారని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ఈ కంగువా కోసం సినిమాలో హీరోగా నటించిన సూర్య చాలా కష్టపడ్డారు. ఎలాగైనా ఈ చిత్రం పాన్-ఇండియా ఆడియెన్స్​కు చేరువ చేయాలని పట్టుదలతో ఉన్నారు. దీని కోసమే ఆయన ప్రభాస్ సాయం తీసుకోబోతున్నారట.

పైగా కంగువా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మించింది. అయితే వేడుకకు ప్రభాస్​ను తీసుకురావడానికి కారణం వెనక యూవీ క్రియేషన్స్ అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే యూవీ బ్యానర్​ వంశీ, ప్రమోద్ ప్రభాస్​ స్నేహితులే! ఏదేమైనా మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రజనీకాంత్​ కూడా చీఫ్ గెస్ట్​గా - ఇక రజనీకాంత్​ వేట్టాయన్​ అక్టోబర్ 10న రావడానికి హీరో సూర్య కూడా ఓ కారణం! వాస్తవానికి వేట్టాయన్​తో కంగువా పోటీ పడాల్సింది. కానీ సూపర్ స్టార్​పై ఉన్న అభిమానంతో తన సినిమా వాయిదా వేసుకున్నారు సూర్య. అందుకే రజనీకాంత్​ కూడా కంగువాకు తన వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు వస్తున్నారట. అలా సూర్య, రజని, ప్రభాస్ ఒకే ఫ్రేమ్​లో కనిపించే అవకాశం ఉందని బయట టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఇది నిజంగా జరుగుతుందో లేదో.

కాగా, కంగువా సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని హీరో సూర్య చాలా కాన్ఫిడెంట్​గా కనిపిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా ఒక సంచలనం సృష్టిస్తుందని మూవీటీమ్​ అంటోంది. ఈ చిత్రం కంగ అనే ఓ పరాక్రముడి కథతో తెరకెక్కిందని సమాచారం. సినిమాలో సూర్య ఆరు భిన్నమైన గెటప్స్​లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ హీరోయిన్. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ - ఆ రోజు నుంచి వరుసగా 'రాజాసాబ్'​ అప్డేట్స్​

'హోస్ట్​గా నాకు చాలా ఆఫర్లు వచ్చాయి- ఆయన కోసమే ఈ షో చేస్తున్నాను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.