ETV Bharat / state

దివ్యాంగులకు మంత్రి సీతక్క గుడ్​న్యూస్​ - త్వరలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి గ్రీన్​సిగ్నల్​ - JOB PORTAL FOR DISABILITIES PEOPLE

దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క - రిజిస్టర్‌ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు

Minister Seethakka On Disabled People Jobs
Minister Seethakka On Disabled People Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2024, 3:29 PM IST

Updated : Oct 14, 2024, 3:43 PM IST

Minister Seethakka On Disabled People Jobs : దివ్యాంగులు కంపెనీల చుట్టూ ఇకపై తిరగాల్సిన అవసరం లేదు. వారికి ఉద్యోగాలు కల్పించే దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ను రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇవాళ మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్​మెంట్​ లెటర్స్​ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, దివ్యాంగులు జాబ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే చాలు క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు వస్తాయన్నారు.

ప్రైవేట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక శాతం రిజర్వేషన్​ను నాలుగు శాతానికి పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్ పాటిస్తామని మంత్రి చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టులకు త్వరలో భర్తీ చేయనున్నట్లు సీతక్క తెలిపారు. దీనిపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.

"దివ్యాంగులకు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమాల్లో చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఈ ఏడాది బడ్జెట్​లో రూ.50 కోట్ల ఖర్చు చేస్తున్నాం. మహిళ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తూ నియామక పత్రాలు జారీ చేశాం."- సీతక్క, మంత్రి

ప్రైవేట్ సంస్థల్లో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాల కోసం యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన vikalangulajobportal.telangana.gov.in పోర్టల్​ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇతరులతో పోటీ పడేందుకు దివ్యాంగులకు ఎన్నో అవరోధాలు ఉంటాయి. అందువల్ల వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్​లైన్ జాబ్ పోర్టల్ రూపొందించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. పోర్టల్​లో నమోదు చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వీరయ్య, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జేడీ శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఆ ఊరి నుంచి 8 మంది ఒకేసారి డీఎస్సీకి ఎంపికయ్యారు

మాకొద్దు ఈ 'పంచాయతీ'లు - పిల్లలకు పాఠాలు చెప్పబోతున్న 111 మంది కార్యదర్శులు

Last Updated : Oct 14, 2024, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.