ETV Bharat / technology

చరిత్ర సృష్టించిన​ స్పేస్​ఎక్స్‌- లాంచ్ ప్యాడ్ వద్దకే రాకెట్ బూస్టర్- వీడియో చూశారా?

ఎలాన్​ మస్క్​ స్పేస్‌ఎక్స్‌ అద్భుతం- తొలిసారిగా లాంచ్‌ప్యాడ్‌‌పై బూస్టర్ సేఫ్ ల్యాండింగ్

author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

SpaceX Creates New Record
SpaceX Creates New Record (Elon Musk X)

SpaceX Creates New Record: ఎలాన్​ మస్క్​కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్​ అరుదైన ఘనత సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే సురక్షితంగా చేర్చి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఒక రాకెట్‌కు చెందిన బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ ప్యాడ్‌ వద్దకే తీసుకురావడం ఇదే తొలిసారి. దీంతో రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో గణనీయమైన విజయాన్ని స్పేస్​ఎక్స్ సంస్థ తన ఖాతాలో వేసుకుంది.

SpaceX Creates New Record
SpaceX Creates New Record (Elon Musk X)

ప్రపంచంలోనే అతిపెద్దదైన 'స్టార్‌షిప్‌' మెగా రాకెట్‌ను స్పేస్​లోకి పంపించారు. ఆదివారం టెక్సస్‌ తీరంలో ఈ ప్రయోగం నిర్వహించారు. 121 మీటర్ల పొడవు కలిగిన ఈ స్టార్​షిప్ రాకెట్​లో బూస్టర్, స్పేస్​క్రాఫ్ట్​ అని రెండు విభాగాలుంటాయి. అంతరిక్షంలోకి ఈ రాకెట్​ను ప్రయోగించిన కొద్దిసేపటి తర్వాత బూస్టర్ నుంచి స్పేస్​క్రాఫ్ట్ విడిపోయింది.

SpaceX Creates New Record
SpaceX Creates New Record (Elon Musk X)

స్పేస్‌క్రాఫ్ట్‌ను హిందూ మహాసముద్రంలో దింపేశారు. బూస్టర్​ను మాత్రం లాంచ్ ప్యాడ్ వద్దకే సురక్షితంగా తీసుకొచ్చారు. అపోలో ప్రోగ్రాం సాటర్న్ V కంటే రెట్టింపు శక్తి కలిగిన ఈ రాకెట్ బూస్టర్ తెల్లవారుజామున ఆకాశంలోకి నీలిరంగు జ్వాలలను చిమ్ముతూ నేలపైకి దూసుకువచ్చింది. ఈ రాకెట్ బూస్టర్‌ను లాంచ్ ప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసిన చాప్‌స్టిక్స్ విజయవంతంగా ఒడిసిపట్టుకున్నాయి. ఈ అద్భుతాన్ని లైవ్​ స్ట్రీమ్​ చేయగా.. చాలామంది ప్రత్యక్షంగా వీక్షించారు.

SpaceX Creates New Record
SpaceX Creates New Record (Elon Musk X)

ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్‌.. 30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటుకే తిరిగి వచ్చి సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఇలాంటి ప్రయోగం సక్సెస్‌ కావడం ఇదే తొలిసారి. అయితే రాకెట్‌ బూస్టర్లను తిరిగి రప్పించడం మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్‌ సంస్థకు కొత్తేమీ కాదు. ఉపగ్రహాలు, వ్యోమగాములను కక్ష్యలో ప్రవేశపట్టిన తర్వాత భూమికి తిరిగొచ్చే ఫాల్కన్‌-9 రాకెట్లకు ఉండే బూస్టర్లను రికవరీ చేస్తూనే ఉంది.

అయితే ఇప్పటి వరకూ ఆ బూస్టర్లను మహాసముద్రాల్లో ఏర్పాటు చేసిన తేలియాడే ప్లాట్‌ ఫామ్‌ల మీద లేదా కాంక్రీట్‌ శ్లాబులపై ల్యాండింగ్ చేసేవారు. ప్రస్తుతం మాత్రం మొదటిసారిగా ఓ రాకెట్ బూస్టర్‌ ఇలా భూమి మీద ఏర్పాటు చేసిన స్ట్రక్చర్‌లో ల్యాండ్ అయింది. ఆకాశం నుంచి వచ్చిన రాకెట్‌ బూస్టర్‌ను.. లాంచ్‌ప్యాడ్‌ దగ్గర సైంటిస్టులు ల్యాండ్‌ చేశారు. దీంతో మనుషులను స్పేస్​లోకి పంపించే ప్రాసెస్​లో ప్రయోగాలు నిర్వహిస్తున్న స్పేస్​ఎక్స్‌ మరో సరికొత్త ప్రయోగంతో అద్భుతాన్ని సృష్టించింది.

ఇస్రో డ్రీమ్ మిషన్​పై లేటెస్ట్ అప్డేట్- శుక్రయాన్-1 లాంచ్ ఎప్పుడో తెలుసా? - ISRO Venus Orbiter Mission

8ఏళ్ల తర్వాత PSLV-C3 రాకెట్ రీ ఎంట్రీ- అట్లాంటిక్​లో పడిన శకలాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.