Special Story on National Birds Day :వాతావరణ కాలుష్యం పక్షులకు పెనుముప్పుగా మారుతోంది. జీవ వైవిద్య నిర్మాణం పదిలంగా ఉండాలి అంటే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మానవులతో సమానంగా జీవించే హక్కు వాటికి ఉంది. ఆదివారం జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా ఓరుగల్లుకు వచ్చే వలస పక్షులు, వాటి ప్రత్యేకతలపై కథనం.
- పక్షులు మనుగడ సాగించాలంటే స్వచ్ఛమైన నీరు, ఆహారం, ఆహ్లాదం వాతావరణం ఉండాలి. ప్లాస్టిక్ పదార్థాలు లేని ప్రాంతాలు వీటికి అనుకూలం. వరంగల్ జిల్లాలోని పాకాల అభయారణ్యం పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉండే ప్రాంతం. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే అరుదైన వలస పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
- పట్టణీకరణ, అడవుల నరికివేత, గూళ్లు కట్టుకునేందుకు చెట్టు లేకపోవడంతో పక్షల సంఖ్య క్రమంగా తగ్గతూవస్తోంది. చెరువుల ఆక్రమణ, కర్మాగారాలు వెదజల్లే ధ్వని, వాయు, జల, భూ కాలుష్యం పక్షులకు ప్రమాదకరంగా మారింది.
- ప్రపంచంలో ఇప్పటికే 20 శాతం పక్షులు అంతరించిపోయే దశలో ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా సుమారు 20వేల జాతులకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
- పక్షులను కాపాడుకోవాలనే నినాదంతో 2002 నుంచి జాతీయ పక్షల దినోత్సవాన్ని జరుపుతున్నారు. క్రిస్మస్ పండుగ జరిగాక పది రోజుకు బర్ కౌంటింగ్ డేను అమెరికాలో నిర్వహిస్తారు.
వీటిని చూసి కొంగలు అనుకుంటే పొరబడినట్లే! - ఆ విశిష్ఠ అతిథులు ఎవరంటే?
ఈ పక్షి పేరు స్పాటెడ్ ఔలెట్స్. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ప్రత్యేక ప్రదేశాల్లో జంటలుగా తిరుగుతుంటాయి. వీటి ఆహారం చెట్లపై ఉండే పురుగులు
ఇక్కడ కనిపిస్తున్న పక్షి స్పర్ వింగ్డ్ లాప్‌వింగ్. ఇవి స్తానిక పక్షులే కాని ఎక్కువగా నదులు, సరస్సులు ఉన్నచోట తిరుగుతుంటాయి. నీటిపై తేలియాడే క్రిములను ఇవి తింటాయి.
ఈ పక్షి పేరు వైట్ రుంప్డ్ షమ. చలికాలంలో ఉత్తరఖండ్ నుంచి వలస వచ్చే ఇవి ఉమ్మడి వరంగల్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి.