Health Benefits By using Curry Leaves in Daily Life :మహిళల దృష్టిలో కరివేపాకు వంటల్లో వేసే ఆకు కాదు, అదో ఎమోషన్. వంట చేయడానికి అన్ని పదార్థాలు ఉన్నా తాలింపు వేయడానికి కరివేపాకు లేదంటే మాత్రం ఎంతో వెలితిగా భావిస్తారు. అందుకే అప్పట్లో పెరట్లో సువాసన వెదజల్లే కరివేపాకును పెంచుకుంటే, ప్రస్తుతం పరిస్థితి అనుగుణంగా బాల్కనీ కుండీల్లోనూ మొక్కల్ని పెంచుతున్నారు. వాసనతో పాటు వంటల్లో రుచి పెంచే ఈ కరివేపాకు ఔషధ గుణాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే సరికొత్త ఉత్పత్తులతో కరివేపాకు అందర్నీ ఆకట్టుకుంటోంది.
కరివేపాకు, వేపాకును పోలి ఉంటుంది. దీనిని స్వీట్ లీవ్స్ అని అంటారు. ఈ ఆకులో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, జింక్, పీచు పోషకాలతో పాటు విటమిన్-బి, విటమిన్ సీ, విటమిన్-ఇలు ఉంటాయి. రోజూ మనం తినే ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకుంటే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
- బరువు తగ్గాలనుకునేవారు కూడా ఉదయం కరివేపాకును తింటే ఎంతో మంచిదట. దీనిలో ‘కార్బజోల్ ఆల్కలాయిడ్స్’ బరువు నియంత్రణలో ఎంతగానో సాయపడతాయి. శరీరంలోలి వ్యర్థాల్నీ సైతం బయటకు పంపిస్తూ, జీర్ణశక్తిని పెంచడంలోనూ కరివేపాకు ఉపయోగపడుతుంది.
- షుగర్ లెవల్స్‌ను నియంత్రించే శక్తి కరివేపాకులో ఉంటుంది. అందుకే మధుమేహులకు ఇది సరైన ఆహారమని అంటారు.
- కరివేపాకులో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపును సైతం మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యల్ని ముందుగానే నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగమే. కొలెస్ట్రాల్‌ని నియంత్రించే గుణాలూ కరివేపాకు ఉన్నాయి.
- వ్యాధినిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి సైతం ఈ కరివేపాకు కాపాడుతుంది. క్యాన్సర్లనీ, నాడీ సంబంధిత వ్యాధుల్నీ అడ్డుకుంటుందట.
- కరివేపాకు వాసన పీల్చితే మనలోని మానసిక ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయట. జ్ఞాపకశక్తిని పెంచే సైతం పెంచే కరివేపాకు అల్జీమర్స్ లాంటి వ్యాధుల్నీ దగ్గరకు రానివ్వదట. మహిళల్లో రుతుక్రమ సమస్యల్నీ అదుపు చేస్తుంది. ఒళ్లు నొప్పుల్నీ, గర్భిణుల్లో వాంతులూ, వికారాల్నీ తగ్గిస్తుందట.
- కరివేపాకు కేవలం ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టును ఆరోగ్యంగా అందంగా ఉంచేలా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఉన్న విటమిన్- ఎ, విటమిన్- బి, ప్రొటీన్లు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తూ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుందట. జుట్టు నిగారింపునూ పెంచుతాయి. అంతేకాకుండా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే లక్షణాలు ఎక్కువే ఉంటాయి. అందుకే చుండ్రు సమస్యలకూ కరివేపాకును ఎక్కువగా వాడుతున్నారు.