Speaker Ayyannapatrudu First Sign: అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో పూజలు నిర్వహించి సభాపతి అయ్యన్నపాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ సభాపతి అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ఈటీవీని సభలోకి రావొద్దనే పిచ్చి నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని ఆయన నిలదీశారు.
ఈటీవీపై ఆంక్షలు తొలగించాలంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే, సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ అయ్యన్నకు లేఖ ఇచ్చారు. లేఖను స్వీకరించిన సభాపతి తక్షణమే ఆంక్షలు సడలిస్తూ తొలిసంతకం చేశారు. ఈటీవీ సహా పలు ఛానళ్లపై ఉన్న నిబంధనలను కొట్టివేస్తూ సంతకం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రసారానికి సంబంధించి అనుమతి నిరాకరిస్తూ గత ప్రభుత్వం ఈటీవీపై నిబంధనలు విధించింది. సభాపతి అయ్యన్న సంతకం చేయడంతో నిబంధనలు తొలగిపోయినట్లయింది.
అంతకు ముందు సభలో ప్రసంగించిన స్పీకర్, సభలో హుందాతనంగా మాట్లాడాలని సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్న స్పీకర్, సమస్యలను ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలన్నారు. శాసనసభను రాష్ట్ర ప్రజలంతా చూస్తారని, 16వ శాసనసభకు మంచి గుర్తింపు వచ్చేలా అంతా సహకరించాలన్నారు.
చట్టసభలో చివరి సారి సభాధ్యక్ష పదవి- సభా గౌరవానికి భగం కలగనివ్వబోను: అయ్యన్న పాత్రుడు - Ayyanna Patrudu as Speaker
ప్రజలు ఇచ్చిన మెజారిటీతో ఎన్నికై చేపట్టిన అధికారం పదవి కాదని బాధ్యతగా గుర్తించాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. శాసనసభా పతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం శాసనసభలో మాట్లాడిన అయ్యన్న, రాష్ట్ర ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం శాసనసభలో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
మరోవైపు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో పాటు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యానించారు. గతంలో శాసనసభ గౌరవాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని అన్నారు. ఎంతో పవిత్రంగా నడపాల్సిన సభను ఇబ్బందికరంగా మార్చారని అయ్యన్న వ్యాఖ్యానించారు. 16 శాసనసభ కు 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేలా వారికి సీట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ పార్టీకి అభినందనలు తెలియచేయాలన్నారు.
రాజ్యాంగ పదవిగా ఉండే సభాపతి స్థానాన్ని చేపట్టానని అయితే తనకు జీవితాన్నిచ్చిన తెలుగుదేశం పార్టీని మర్చిపోలేనని అన్నారు. మరోవైపు సభలో సంప్రదాయాలు, నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందేనని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రశ్నవేసేందుకు నేర్చుకోవాలని సూచించారు. శాసనసభను ప్రజలు నిత్యం గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. పదవి పండుగ కాదు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇక నుంచి స్పీకర్ తక్కువ సభ్యులు ఎక్కువగా మాట్లాడేలా చర్యలు తీసుకుంటానని అయన్న సభలో ప్రకటించారు.
లాంఛనంగా స్పీకర్ స్థానంలో అయ్యన్న- అభినందనలు తెలిపిన కూటమి నేతలు - AP Assembly Speaker Ayyanna Patrudu