How to Make Tomato Pulao : మనం ఇంట్లో ఏ కర్రీ వండాలన్నా టమాటాలు, ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ రెండూ లేకపోతే ఏ రెసిపీకి అంత రుచి రాదు. అందుకే దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉల్లిపాయలు నిల్వ ఉంటాయి. అలాగే టమాటాలు కూడా రెండు మూడు రోజులకు సరిపడా ఉండేలా చూసుకుంటారు. అయితే, టమాటాలతో కర్రీ, మిగతా కూరలు చేసుకోవడం కామన్. ఎప్పుడూ ఇలానే కాకుండా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటా పులావ్ ఓ సారి ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఉదయాన్నే ఈ పులావ్ ప్రిపేర్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్‌గా కూడా పెట్టేయచ్చు. పిల్లలు కూడా ఈ పులావ్ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈజీగా టమాటా పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- రైస్ - 2 కప్పులు
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- టమాటాలు - 3
- నూనె -2 టేబుల్‌స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- గరం మసాలా - అరటీస్పూన్
- ధనియాలపొడి - అరటీస్పూన్
- కారం - టీస్పూన్
- పసుపు - చిటికెడు
- కరివేపాకు-1
- కొత్తిమీర, పుదీనా - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా రైస్ శుభ్రంగా కడిగి అన్నం పొడిపొడిగా వండుకోండి. ఆపై టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అనంతరం సగం టమాటా ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి.
- ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేయండి. అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కరివేపాకు రెమ్మ వేసి వేపుకోండి.
- అనంతరం మిగిలిన టమాటా ముక్కలు వేసి మగ్గించండి.
- టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి.
- తర్వాత పొడిపొడిగా వండుకున్న అన్నం వేసుకుని బాగా మిక్స్ చేయాలి. రైస్‌కి మసాలా బాగా పట్టిందంటే చాలు సూపర్ టేస్టీ టమాటా పులావ్ మీ ముందుంటుంది.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పులావ్ వేడివేడిగా తినచ్చు. మరి మీరు కూడా ఇలా ఎప్పుడైనా టమాటా పులావ్ ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి:
బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసే "ఎగ్ వెజ్ బిర్యానీ" - ఒక్కసారి తింటే వదలిపెట్టరు!
గోదారోళ్ల స్పెషల్ అద్దిరిపోయే "కొబ్బరి పాకుండలు" - ఇలా చేస్తే రుచి ఎంతో అద్భుతం!