ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వాన - పొంగుతున్న వాగులు, వంకలు - Heavy rains in AP - HEAVY RAINS IN AP

Southwest Monsoon Caused Heavy Rains Across the State: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు నదులతో పాటు వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. పలు పట్టణాల్లో వరద ప్రభావానికి వాహనాల రాకపోలకు అంతరాయం వాటిల్లింది. కుండపోత వానకు మొక్కజొన్న, పత్తి, కూరగాయల రైతులకు నష్టం వాటిల్లింది.

heavy_rains_in_ap
heavy_rains_in_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 7:29 PM IST

రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వాన - పొంగుతున్న వాగులు, వంకలు (ETV Bharat)

Southwest Monsoon Caused Heavy Rains Across the State:రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకల్లో వరద ప్రవాహం పోటెత్తింది. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుండపోత వానకు మొక్కజొన్న, పత్తి, కూరగాయల రైతులకు నష్టం వాటిల్లింది.

Anantapur District:అనంతపురంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపించాయి. భారీ వర్షానికి వేదవతి, హగరి నదులతో పాటు వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. డి.హీరేహాల్‌ మండలం చెర్లోపల్లి వద్ద హెచ్​ఎల్​సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. హెచ్​ఎల్​సీ అండర్‌ టన్నెల్‌ ఛానల్‌కు రంధ్రం పడి వరద నీరు వంకలోకి చేరుతోంది. కనేకల్ మండలంలో సొల్లాపురం, ఎన్.హనుమాపురం, హనకనహాల్ వద్ద వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

వేదావతి, హగరి ఉద్ధృతితో కనేకల్-ఉరవకొండ మధ్య రాకపోకలు స్తంభించాయి. డి.హీరేహాల్ మండలం హోసగుడ్డం వద్ద పెద్దవంక, సోమలాపురం వద్ద గంగమ్మ వంక ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాయదుర్గం-బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిలో రాకపోకలు ఆగిపోయాయి. బొమ్మనహాల్ మండలంలో పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బెలుగుప్ప మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. బూదగవి వంక వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

ప్రాణాలు అరచేతిలో - కొండచరియల్లో బిక్కు బిక్కుమంటున్న జనాలు - Houses damaged cause landslides

Kurnool District:కర్నూలు జిల్లాలో కర్నూలుతో పాటు ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ, మంత్రాలయంలో వర్షం కురిసింది. హాలహర్వి మండలం బాపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగడంతో ఆంధ్రా, కర్ణాటకకు రాకపోకలు నిలిచాయి. ఉల్చాలలో కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి.

Nandyala District:నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని స్టీల్ ప్లాంట్ వద్ద వద్దెల వాగు ఉద్ధృతికి పాణ్యం-బనగానపల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాణ్యం మండలంలోని భువనపాడు నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో వాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహానంది, కోవెలకుంట్లలోనూ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి.

Nellore District:నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

జమ్మలమడుగులో భారీ బందోబస్తు - అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు: డీఎస్పీ - Police Picket In Jammalamadugu

Bapatla District:బాపట్ల జిల్లాలోని పలుప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Anakapalli District:అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వర్షానికి విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. నదులతో పాటు వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.

Alluri District:అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో విస్తరణ పనులు చేపట్టిన జాతీయ రహదారి వానకు చిత్తడిగా మారింది. రోడ్డుపై బురదతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో పలుచోట్ల వర్ష సూచనలున్నాయన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రోడ్లన్నీ బురదమయం - ప్రయాణం ప్రాణాంతకమే - Mud Roads People Facing Problems

ABOUT THE AUTHOR

...view details