Sabarimala Special Trains : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఈ రైళ్లు డిసెంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. వీటిలో విశాఖపట్నం - కొల్లం - విశాఖ ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు 26 సర్వీసులు అందించనుంది.
- విశాఖ - కొల్లం ప్రత్యేక రైలు (08539) ప్రతి బుధవారం ఉదయం 8:20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి, గురువారం మధ్యాహ్నం 12:55 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- కొల్లం నుంచి విశాఖ రైలు (08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7:35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11:20 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది.
అలాగే శ్రీకాకుళం రోడ్ - కొల్లం - శ్రీకాకుళం రోడ్ మధ్య 18 సర్వీసులు నడపనుంది. వీటిలో శ్రీకాకుళం రోడ్ - కొల్లం మధ్య డిసెంబర్ 1 నుంచి జనవరి 27 వరకు సర్వీసులు అందించే ప్రత్యేక రైలు (08553) ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కొల్లం చేరుకోనుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 08554 రైలు ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4:30గంటలకు బయల్దేరుతుంది. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.