How to Make Chitti Muthyalu Veg Biryani : బిర్యానీ అనగానే మనందరికీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ, తాడిపత్రి మటన్ బిర్యానీ గుర్తుకొస్తుంటుంది. ఈ రెండు బిర్యానీల రుచి ఎంత బాగున్నా ఎప్పుడూ ఇంట్లో చేయాలంటే మాత్రం కుదరదు. అయితే, ఇంట్లో నాన్‌వెజ్‌తో బిర్యానీ చేసుకోవడం కామన్. అందుకే ఈ సారి కొత్తగా మీ కోసం వెజ్ బిర్యానీ రెసిపీ తీసుకొచ్చాం. అది కూడా చిట్టిముత్యాల రైస్ తో. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే చిట్టిముత్యాల వెజ్ బిర్యానీ అద్దిరిపోతుంది. పైగా ఈ వెజ్ బిర్యానీ బద్దకస్తులైన బ్యాచిలర్స్ కూడా ట్రై చేయచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి
కావాల్సిన పదార్ధాలు :
- చిట్టిముత్యాల రైస్ - 2 కప్పులు
- అనాస పువ్వు - 1
- కారం - టీ స్పూన్
- మిరియాలు - 10
- యాలకలు - 4
- లవంగాలు - 6-7
- దాల్చిన చెక్క - 2
- బిర్యానీ ఆకు - 1
- జీడిపప్పు - 15
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 2
- కాలీఫ్లవర్ ముక్కలు - పావుకప్పు
- క్యారెట్ - 2 చిన్నవి
- బీన్స్ ముక్కలు - పావుకప్పు
- టమాటా - 1
- అల్లం వెల్లులి పేస్ట్ - టేబుల్‌స్పూన్
- పెరుగు - పావుకప్పు
- కొత్తిమీర, పుదీనా - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - కొద్దిగా
- వేడి నీళ్లు - 4 కప్పులు
తయారీ విధానం:
- ముందుగా చిట్టిముత్యాల రైస్ శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- అలాగే వెజ్ బిర్యానీలోకి కావాల్సిన క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, బీన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇంకా పుదీనా, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేయండి.
- నూనె వేడయ్యాక అనాస పువ్వు, మిరియాలు, యాలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి వేపండి.
- ఆపై పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఈ టైమ్‌లో కొద్దిగా ఉప్పు వేస్తే ఆనియన్స్ గోల్డెన్ కలర్లో బాగా వేగుతాయి.
- అనంతరం క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేపండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గించండి.
- ఆపై కారం, పెరుగు వేసి మిక్స్ చేయండి. అలాగే టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కాసేపు వేపుకోండి.
- ఇప్పుడు వేడివేడి నాలుగు కప్పుల నీరు పోసి ఓ 5 నిమిషాలు మరిగించుకోండి
- అనంతరం నీటిలో నానబెట్టిన రైస్, నిమ్మరసం వేసి కలపండి.
- ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి మధ్యమధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోండి.
- బిర్యానీ తయారైన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర చల్లండి.
- అంతే ఇలా సింపుల్‌గా రెడీ చేసుకుంటే సూపర్ టేస్టీ చిట్టిముత్యాల వెజ్ బిర్యానీ మీ ముందుంటుంది.
- వెజ్ బిర్యానీ నచ్చితే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!
ఘాటైన "వెల్లుల్లి రసం" - వేడివేడి అన్నంతో తింటే జలుబు, పొడిదగ్గు నుంచి రిలీఫ్!