AP CS Vijayanand Review On Whats App Governance Service : రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సప్ గవర్నెన్సు సేవలు అందించేందుకు సిద్ధగా ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. వాట్సప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కూడా కల్పిస్తున్నామని సీఎస్ వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
పెట్టుబడి కంటే ఐడియా ముఖ్యం - తెలుగువాళ్లు ఉన్నత స్థానాలకు ఎదగాలి: చంద్రబాబు
దీనికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్టు సీఎస్ వివరించారు. వాట్సప్ గవర్నెనెన్సు ద్వారా పౌర సేవలు అందించే అంశంపై సమీక్ష నిర్వహించిన సీఎస్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలుజారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పగడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి అధ్యయనం చేసి ఈ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు.
పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖలు ఆర్టీజీఎస్ అధికారులకు సహకారం అందించాలని సీఎస్ సూచించారు. వాట్సాప్ ద్వారా ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. డాటా లేక్ ఏర్పాటు పనులు కూడా చురుగ్గా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రం జనరేట్ అయితే ఆ వెంటనే సంబంధిత పౌరుల వాట్సాప్‌కు సందేశం పంపండంతో పాటు, ఆ వెంటనే వాట్సాప్ ద్వారానే ఈ పత్రాలు డౌనులోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు.
త్వరలోనే ఆన్‌లైన్, సచివాలయాల్లో బుకింగ్ సదుపాయం: సీఎం చంద్రబాబు - CM Teleconference with Activists
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు: పవన్ - Deputy CM Pawan Video Conference