Government job notifications : ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలపై ఓ లుక్కేయండి. పదో తరగతి విద్యార్హత మొదలుకుని, ఇంటర్మీయట్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి ఎన్నో అవకాశాలున్నాయి. వీటిలో విజయవాడతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలున్నాయి.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నియామక ర్యాలీ - ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
విజయవాడలో :
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కాంట్రాక్టు పద్ధతిలో 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జనరల్ మేనేజర్ పోస్టులు 2, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టు ఒకటి ఖాళీ ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏఐ, ఎంబీఏ (ఫైనాన్స్)తో పాటు పని అనుభవం అర్హతగా నిర్ణయించింది. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. apsfl@ap.gov.in మెయిల్ ద్వారా జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://apsfl.in/
వైఎస్సార్ కడప జిల్లాలో :
వైఎస్సార్ కడప జిల్లాలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో 32 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిట్టర్ 9, ఎలక్ట్రీషియన్ 9, వెల్డర్ 4, టర్నర్/మెషినిస్ట్ 3, డీజిల్ మెకానిక్ 3, కార్పెంటర్ 2, ప్లంబర్ 2 ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషనిస్ట్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ అర్హత కాగా, అభ్యర్థుల వయస్సు జనవరి 13నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఫిబ్రవరి 12లోగా https://ucil.gov.in/job.html వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
అస్సాంలో :
అస్సాంలోని సీఎస్‌ఐఆర్ - నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 8, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు 4 ఉన్నాయి. పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో పదోతరగతి/ ఇంటర్‌తో పాటు పని అనుభవం అర్హతగా నిర్ణయించారు. సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్ల వయస్సు మించకూడదు. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు రూ.25వేల నుంచి రూ.81వేలు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 19వేల నుంచి 63వేల వేతనం ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా. ఎంపిక ఉంటుంది. www.neist.res.in/notice.php వెబ్‌సైట్ లో ఫిబ్రవరి 14లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మధ్యప్రదేశ్‌లో..
ఐఐటీ ఇండోర్ 12 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 1, మెడికల్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1, సీనియర్ ఇంజినీర్ 1, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 1, జూనియర్ సూపరింటెండెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు ఉన్నాయి. పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో డిగ్రీ/బీటెక్ (సివిల్)/ ఎండీ/ఎంఎస్/తో పాటు పని అనుభవం అర్హతగా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లకు 45 ఏళ్లు, సీనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్‌లకు 40 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు వయో అర్హత ఉండాలి.
వేతనం ఇలా..
- ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రూ.67,700 - రూ.2,08,700
- మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.56,100 - రూ.1,77,500
- సీనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ రూ.44,900 - రూ.1,42,400
- జూనియర్ సూపరింటెండెంట్ రూ.35,400 - రూ.1,12,400
- జూనియర్ అసిస్టెంట్ రూ.25,500 - రూ.81,100.
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://www.iiti.ac.in/recruitments/non-teaching-recruitment వెబ్సైట్లో జనవరి 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
రాజస్థాన్‌లో :
హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (జాయింట్ వెంచర్ కంపెనీలో వందకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయి. మొత్తం 121 ఎగ్జిక్యూటివ్, ఇంజినీరింగ్, మేనేజిరియల్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 8లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ 80, ఇంజినీర్ 6, ఆఫీసర్ 1, సీనియర్ ఇంజినీర్ 11, సీనియర్ మేనేజర్ 23 ఖాళీలున్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంబీఏతో పాటు ఉద్యోగానుభవం అర్హతగా నిర్ణయించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ 25 ఏళ్లు, ఇంజినీర్, ఆఫీసర్ అభ్యర్థులు 29 ఏళ్లు, సీనియర్ ఇంజినీర్ 34 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించకూడదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: https://hrrl.in/Hrrl/
వేతనాలు ఇలా..
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ రూ.30,000- రూ.1,20,000
- ఇంజినీర్, ఆఫీసర్ రూ.50,000- రూ.1,60,000
- సీనియర్ ఇంజినీర్ రూ.60,000 - రూ.1,80,000
- సీనియర్ మేనేజర్ రూ.80,000- రూ.2,20,000.
కోల్‌కతాలో :
కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ మేనేజర్ 2, ఆఫీసర్ 4, జూనియర్ మేనేజర్ 2, సీనియర్ మేనేజర్ 2, డిప్యూటీ మేనేజర్ 3 ఖాళీలున్నాయి. సేల్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్, ఛానల్స్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఫార్మా వర్టికల్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. పోస్టు ఆధారంగా డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ పీజీతో పాటు పని అనుభవం ప్రధాన అర్హతగా నిర్ణయించారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నై నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు www.balmerlawrie.com/ వెబ్సైట్లో ఫిబ్రవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆటలపై మక్కువ ఆ ఊరి యువత రాత మార్చింది - పోలీస్ శాఖలో 75మందికి ఉద్యోగాలు
ఉద్యోగం మీ లక్ష్యమా? - టాప్ టెన్ రంగాల్లో లక్షలాది అవకాశాలు