1250 Electric Buses Will Soon Arrive in State : రాష్ట్రానికి త్వరలో 1,250 విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా కేంద్రాల్లో సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే రాష్ట్రంలో 1,500 కొత్త బస్సులు తీసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 1,250 విద్యుత్తు బస్సుల కోసం కేంద్రాన్ని కోరామని, త్వరలో అవి రానున్నాయని తెలిపారు.
కొన్ని దూరప్రాంతాలకు నడిపేందుకు డీజిల్ బస్సులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత సంక్రాంతి సమయంలో ఒక రోజు మాత్రమే రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది మూడుసార్లు రూ.20 కోట్లు దాటిందన్నారు. కమర్షియల్ ఆదాయమూ పెంచుకోవడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఆర్టీసీ సిబ్బందికి 2017 పీఆర్సీ బకాయిలు 50 శాతం చెల్లించామని, ఈ సంక్రాంతికి వచ్చిన ఆదాయాన్ని బట్టి వారం రోజుల్లో మరో 25 శాతం చెల్లించే అవకాశం ఉందని చెప్పారు.
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు