తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ రూట్లలో 36 రైళ్లు రద్దు - మరో 9 దారి మళ్లింపు - కారణమిదే! - 30 TRAINS CANCELED IN SCR

36 రైళ్లను వేర్వేరు తేదీలలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే - ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్​ లాకింగ్ పనుల దృశ్యా నిర్ణయం

SOUTH CENTRAL RAILWAY
SCR CANCELED 30 TRAINS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 8:22 AM IST

SCR Canceled 30 Trains : ఖమ్మం రైల్వే స్టేషన్‌ వద్ద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్‌ గురువారం ప్రకటించారు. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్‌-విజయవాడ, భద్రాచలంరోడ్డు-విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 10 నుంచి 20 (అంటే దాదాపు 11 రోజులు) వరకు రద్దు చేశారు. గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్‌లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. నాలుగు రైళ్లు 60-90 నిమిషాల ఆలస్యంగా బయల్దేరనున్నట్లు వెల్లడించారు.

రద్దయిన రైళ్లు వాటి తేదీలు :సికింద్రాబాద్‌-గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌: ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21 వరకు

సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233/17234)

భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌:ఫిబ్రవరి10 నుంచి 21 వరకు

  • ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు-సికింద్రాబాద్‌ (12705/12706) : 10, 11, 15, 18, 19, 20
  • శాతవాహన ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-సికింద్రాబాద్‌ (12713/12714) : 11, 14, 16, 18, 19, 20
  • రద్దయిన జాబితాలో మరికొన్ని రైళ్లు ఉన్నాయి.
  • వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, ఆదిలాబాద్‌-తిరుపతి (17406) 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతాయి.

Six Trains Cancelled :ఏపీలోని విజయవాడ డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్‌ సెక్షన్‌ ప్రారంభించేందుకు జరుగుతున్న నాన్‌-ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఈ నెల 8వ తేదీన ఆరు రైళ్లను తాత్కాలికంగా రైల్వే అధికారులు రద్దు చేశారు. వీటితోపాటు 7, 8వ తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

8వ తేదీన రద్దు అయిన రైళ్ల వివరాలు:

  • 67261 నెంబర్​తో నడిచే రాజమహేంద్రవరం - విజయవాడ రైలు
  • 67262 నెంబర్​తో నడిచే విజయవాడ - రాజమహేంద్రవరం రైలు
  • 67202 నెంబర్​తో నడిచే విజయవాడ - రాజమహేంద్రవరం రైలు
  • 67201 నెంబర్​తో నడిచే రాజమహేంద్రవరం - విజయవాడ రైలు
  • 17258 నెంబర్​తో నడిచే కాకినాడ పోర్టు - విజయవాడ రైలు
  • 17257 నెంబర్​తో నడిచే విజయవాడ - కాకినాడ పోర్టు రైలు

సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు 180 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ తెలుసా?

ప్రయాణికులకు గుడ్​న్యూస్ - త్వరలోనే చర్లపల్లి నుంచి మరో 8 రైళ్ల పరుగులు

ABOUT THE AUTHOR

...view details