తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ బావమరిది ఫామ్​హౌస్​లో అర్ధరాత్రి భారీ శబ్ధాలతో పార్టీ - రైడ్ చేసిన పోలీసులు - డ్రగ్స్ గుర్తింపు - RAVE PARTY AT JANWADA FARMHOUSE

జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్‌పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ - పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించిన పోలీసులు - ఫామ్​హౌస్ యజమాని కేటీఆర్ బావమరిదిగా గుర్తింపు

Police Raids at Janwada Farmhouse
Police Raids at Janwada Farmhouse (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 11:56 AM IST

Updated : Oct 27, 2024, 4:34 PM IST

Police Raids at Janwada Farmhouse : హైదరాబాద్​ జన్వాడలోని ఫామ్​హౌస్​పై సైబరాబాద్​ ఎస్​వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్​ కాలనీలో ఉన్న రాజ్​పాకాల ఫామ్​హౌస్​లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్​ పరీక్షలు నిర్వహించగా, ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్​​గా నిర్ధారణ అయింది. కొకైన్​ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్​డీపీఎస్​ యాక్ట్​ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో పోలీసులు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్​ యాక్ట్​ సెక్షన్ 34 కింద మరో కేసును నమోదు చేశారు.

భారీగా విదేశీ మద్యం స్వాధీనం :మద్యం పార్టీలో మొత్తం 35 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పాల్గొన్న వారిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్​హౌజ్​ యజమాని రాజ్​ పాకాలా కేటీఆర్​ బావమరిదిగా గుర్తించారు. విజయ్​ మద్దూరి అనే వ్యక్తి కొకైన్​ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్​డీపీఎస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.ఎక్సైజ్​ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మద్యం పార్టీ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో విదేశీ మద్యం సహా, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై విచారణ చేపట్టినట్లు ఎక్సైజ్‌ సీఐ శ్రీలత తెలిపారు. ఏ1గా ఫామ్‌హౌస్‌ సూపర్‌వైజర్‌ కార్తిక్‌, ఏ2గా కేటీఆర్​ బావమరిది రాజ్‌ పాకాలను చేర్చామన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించినట్లు చెప్పారు. కర్ణాటక లిక్కర్‌తోపాటు విదేశీ మద్యం కూడా కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఏడు లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్‌ పాకాల పరారీలో ఉన్నారని, విచారణలో మరికొన్ని వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఫామ్​హౌస్​లో క్యాసినో పరికరాలు : క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకోవడంతో క్యాసినో నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్​హౌస్​లో ప్లేయింగ్​ కార్డ్స్​, ప్లాస్టిక్​ కైన్స్​ వంటివి కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 30 ఎకరాల్లో రాజ్​ పాకాల ఫామ్​హౌస్​ విస్తరించి ఉంది. ఈ ఫామ్​హౌస్​ పార్టీపై బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే రాజధానిలో అధిక మొత్తంలో డ్రగ్స్​, గంజాయిలను పోలీసుల స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జన్వాడ ఫామ్​హౌస్​ అర్ధరాత్రి పార్టీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జన్వాడ ఫాంహౌస్​ను ఏ అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు! - Hydra Focus on Janwada Farm House

'అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామన్న సీఎం - జన్వాడ ఫాంహౌస్​ను ఎందుకు కూల్చడం లేదు' - Bandi Sanjay on HYDRA

Last Updated : Oct 27, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details