Free Coaching For Mega DSC in AP :మీరు మెగా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా ? టీచర్ కావాలనే మీ లక్ష్యమా ? అయితే ఇది మీ కోసమే. డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈ ఉచిత శిక్షణకు ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనంతోపాటు వసతి సౌకర్యాలను కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా జిల్లాల్లో అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో మూడు నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఉంటుంది. దీనికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అక్టోబర్ 21లోపు జ్ఞానభూమి వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫ్రీ కోచింగ్ వివరాలు
- మెగా డీఎస్సీ 2024-25గాను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
- మొత్తం 5 వేల 50 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050, ఎస్టీలకు 2 వేల సీట్లు కేటాయించారు. ఉచిత శిక్షణకు ఎంపికైన వారికి ఉచితంగా బోధన, భోజనంతోపాటు వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
అర్హత :ఎస్జీటీ ఉచిత శిక్షణకు ఇంటర్, డీఈడీ, టెట్ ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ కోచింగ్‌కు డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.