Social Media Password Safety Guidelines :ఫేస్‌బుక్, యాప్‌ల లాగిన్ పాస్వర్డ్లు సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఆచార్యులు అంటున్నారు. ఫేస్‌బుక్, యాప్‌లలోకి వినియోగదారులు ప్రవేశించేపటప్పుడు పేరు, వివరాలు, పాస్వర్డ్లు ఆటోఫిల్ (వాటంతటవే) అవుతున్నాయి. దీన్ని గమనించకుండా కొందరు అలాగే వదిలేస్తున్నారని, ఇలా చేయడం వల్ల మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థల పాస్వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని ఆచార్యులు అంకిత్ గంగ్వాల్ పరిశోధించారు.
ఆయన పరిశోధనను ఆటోస్పిల్: క్రెడెన్షియల్ లీకేజ్ ఫ్రమ్ మొబైల్ పాస్వర్డ్ మేనేజర్ పేరుతో తన పరిశోధన పత్రాన్ని 4 నెలల క్రితం లండన్‌లో జరిగిన సైబర్ భద్రత సదస్సులో సమర్పించారు. ఈ పరిశోధన (Autospill Research) పత్రానికి ఇప్పటికే ఏసీఎం సదస్సులో ఉత్తమ పత్రంగా బహుమతిని గెలుచుకుంది. దీంట్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరాగాళ్లకు ఎలా వెళుతుందనే సమాచారం ఉంటుంది. దాని ద్వారా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అంశాలు, క్లుప్తంగా ఉంటాయి. చరవాణి ద్వారా ఫేస్‌బుక్, సామాజిక మాధ్యమాలు, మొబైల్ యాప్‌లలో లాగిన్ అయ్యేప్పుడు ఆటోఫిల్ కాకుండా సొంతంగా (వ్యక్తిగతంగా) టైప్ చేయాలని సూచించారు.
Facebook Hacked Account Recovery : మీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందా?.. అయితే ఈ టిప్స్‌తో ఈజీగా రికవర్ చేయండి!
Cyber Crime safety Measures : సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్థులు చరవాణుల ద్వారా ఫేస్‌బుక్, సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు,పాస్‌వర్డ్‌లను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్‌తో పాటు స్పాటిఫై, బుక్ మై షో వంటి మొబైల్ యాప్‌ల అధికారిక పేజీల కింద రహస్యంగా మరో పేజీని (Fake Pages on Apps) ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సాంకేతిక పరిభాషలో ఆటోస్పిల్ దాడి అంటారు. వీటి ద్వారానే వినియోగదారులు వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.
పాస్వర్డ్ సేవ్ చేయకుండా 'బ్రౌజర్' నియంత్రణ ఎలా?
Facebook Password Login Safety Tips :చరవాణి ద్వారా ఫేస్‌బుక్‌లోకి వెళ్లేందుకు లాగిన్ అయినప్పుడు పేరు, వివరాలన్నీ ఆటోఫిల్ రూపంలో వస్తాయి. కానీ పాస్వర్డ్ మాత్రం మనమే టైప్ చేయాలి. పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు వివరాలన్నీ అప్పటికే ఏర్పాటు చేసిన రహస్య పేజీలోకి (Social Media Fake Pages) వెళ్తాయి. ఆ పాస్వర్డ్ ద్వారా సైబర్ నేరస్థులు బ్యాంక్ ఖాతాల్లో నగదులు బదిలి చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఫొటోలు తీసకుని వాటిని మార్ఫింక్ చేస్తామంటూ బెదిరించేందుకు అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సామాజిక్ మాధ్యమాల్లో లాగిన్ అయ్యేటప్పుడు వ్యక్తిగతంగా పాస్వర్డ్ పెట్టుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇలా చేస్తే వినియోగదారుల డేటా ఇతరులు దొంగలించడానికి ఉండదని తెలిపారు.
పాస్వర్డ్ ఇలా ఉంటే హ్యాక్ అసాధ్యమే!