Singareni Insurance Scheme Telangana 2024 : సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ (Telangana Singareni)పై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉన్న బీమా పథకాన్ని సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కార్‌కే దక్కిందని వెల్లడించారు.
One Crore Insurance To Singareni Employees :కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం (SCCL Insurance Scheme Telangana) గతంలో ఎప్పుడూ లేదని రేవంత్ అన్నారు. 43వేల మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కార్మికుల కుటుంబాలను కాపాడుకునేందుకే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి భారీ బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.
సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌పై బదిలీ వేటు - ఫైనాన్స్ డైరెక్టర్ బాలరామ్‌కు అదనపు బాధ్యతలు