Singapore University Professor Meet IT Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో మెరుగైన విద్యా ప్రమాణాలు, ర్యాంకింగ్స్, మెరుగుదల, సంస్కరణల అమలుకు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రొఫెసర్ చౌదరి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో స్ట్రాటజిక్ ఇండియా అండ్ ఇనిషియేటివ్స్ విభాగానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.
ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదల కారణలపై చర్చ : రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరు, మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ చౌదరి లోకేశ్‌తో చర్చించారు. రీసెర్చ్, ఇన్నొవేషన్స్లో వెనుకబడి ఉండటమే ఏపీలో ర్యాంకింగ్స్ తగ్గుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. వీటిని మెరుగుదల చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రొఫెసర్ అన్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ను తీసుకురావడానికి అవసరమైన పాఠ్యాంశాల మార్పులు, ఇతర విధానాలను ఏపీ వర్సిటీలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రొఫెసర్ చౌదరి తెలిపారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యూనివర్సిటీలకు మంచి గుర్తింపు లభిస్తుందని చౌదరి పేర్కొన్నారు.
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census