SIB Ex DSP Praneeth Rao Case Updates : తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వ్యవహారంలో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారిని శనివారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు, ఎస్ఐబీలో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన విషయంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్‌రావు ఇచ్చిన వివరాల ఆధారంగా కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar rao), మాజీ టాస్క ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ యజమాని శ్రవణ్‌ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
Two Police Officers Arrested In Phone Tapping Case :శుక్రవారం రాత్రి నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో భుజంగరావు, తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు జరిపిన పోలీసులు, శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలవి 41ఏ – సీఆర్పీసీ (CRPC) నోటీసులు అందించారు. విచారణ అనంతరం ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా కేసు పూర్వాపరాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ :మరోవైపు ట్యాపింగ్ వ్యవహారంలో నిఘా విభాగం మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్(Sravan) రావులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్‌రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా పూర్తిస్థాయిలో విచారణ చేస్తూ పోలీసులు ముందుకు సాగుతున్నారు. కస్టడీ విచారణలో ప్రణీత్‌రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు ఒప్పుకున్నారు. దీంతో ఎస్ఐబీలో నోడల్ అధికారి కాకుండా ప్రణీత్ రావే, 'లా ఆఫ్ ఇంటర్సెప్షన్'లా(law Of interception) ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.