తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 10:15 AM IST

Updated : Mar 16, 2024, 10:38 AM IST

ETV Bharat / state

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు - అతని కస్టడీ పిటిషన్​పై కోర్టులో వాదనలు!

SIB Ex DSP Praneeth Rao Case Update : కాల్​ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల ధ్వంసం చేసిన ప్రణీత్​రావు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్​పై నేడు వాదనలు జరిగే అవకాశం ఉంది.

Praneeth Rao Case Update
SIB Ex DSP Praneeth Rao Case Update

SIB Ex DSP Praneeth Rao Case Update : కాల్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల ధ్వంసం చేసి అరెస్టైన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఎస్​ఐబీ(SIB)లోని ప్రణీత్ రావు పనిచేసిన ఛాంబర్​ను పరిశీలించారు. అక్కడ డిసెంబర్ 4వ తేదీన అతను స్విచ్ ఆఫ్ చేయక ముందు తర్వాతి సీసీ ఫుటేజ్​లను పరిశీలించారు. కాగా అక్కడ ఆ సమయంలో పని చేసిన ఎలక్ట్రీషియన్​ను కూడా విచారించాలని భావిస్తోంది. అతని సాయంతోనే డిసెంబర్ 4వ తేదీన 17కంప్యూటర్లలోని హార్డ్‌డిస్కులు మాయం చేసి కొత్తవి ప్రణీత్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రణీత్​రావు రిమాండ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?

దీంతో పాటుగా అతని బృందలో పని చేసిన వారిని కూడా ఒక్కొక్కరినీ పిలిచి విచారించాలని ప్రత్యేక బృందం భావిస్తోంది. తాను డీఎస్పీగా ఉన్న సమయంలో తనతో పని చేసిన వారిని విచారిస్తే ప్రణీత్​ వారికి ఏం పనులు చెప్పాడు, హార్డ్​ డిస్క్​లు మాయం చేయాల్సినంత డేటా అందులో ఏముంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు యోచిస్తున్నారు.

మరోవైపు అరెస్ట్ సమయంలో అతని వద్ద స్వాధీనం చేసుకున్న సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లను విశ్లేషించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అందులో డేటాను ఎనలైజ్ చేసేందుకు వాటిని ఎఫ్​ఎస్​ఎల్​కి పంపారు. కాగా ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టులో(Nampally Court) పోలీసులు పిటిషన్ వేయగా దీనిపై నేడు వాదనలు జరిగే అవకాశం ఉంది.

ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు

Phone Tapping Case On Praneeth Rao :ఓ వ్యాపారవేత్త ప్రణీత్​పై పంజాగుట్ట పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ ట్యాపింగ్​ చేయడంతో పాటు, తన కుటుంబీకులందరికి మానసిక క్షోభకి గురి చేశారని ఆ రియల్ ఎస్టేట్​ వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి ప్రణీత్​రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్​లో (Political Intelligence) పనిచేశారు. ఈ డిపార్ట్​మెంట్​ మొదట ప్రధాన ఇంటెలిజెన్స్​లోని సీఐసెల్​ (CI CELL) పర్యవేక్షణలో ఉండేది.

దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ విభాగాన్ని ఎస్​ఐబీకి మార్చారు. అప్పటి నుంచి బేగంపేట నుంచి పనిచేస్తున్న ఆ డిపార్ట్​మెంట్​లోకి 2018లో ప్రణీత్​రావు, ఇటీవలి కాలంలో వరకు అక్కడే డీఎస్పీగా కొనసాగారు. సాధారణంగా ఈ బ్రాంచ్​లో మావోయిస్టు కార్యకలపాలకు సంబంధించిన కార్యాచరణ మాత్రమే జరుగుతుంటుంది. కానీ ప్రణీత్​ బృందం మాత్రం అందుకు భిన్నమైన పాత్రను పోషించినట్లు సమాచారం. ప్రభుత్వం మారిన తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే అంటే గత డిసెంబరు 4నే ఆధారాల్ని ధ్వంసం చేయడం పలు అనుమానాలకు తావిచ్చే అంశంగా మారింది.

ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు

Last Updated : Mar 16, 2024, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details