Shawarma Adulteration in Hyderabad: షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన మేడ్చల్- మల్కాజ్గిరి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో చోటు చేసుకుంది. లోతుకుంటలోని గ్రిల్ హౌస్ అనే షాపులో దసరా రోజు రాత్రి కొంతమంది కస్టమర్స్ తినడానికి స్నేహితులతో కలిసి షవర్మాను కొనుగోలు చేశారు. దానిని తిన్న వినియోగదారులకు మరుసటి రోజు నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో బాధితులు బొల్లారంలోని కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేష్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదించడంతో వారు విషయం వెల్లడించారు. బాధితులు తిన్న ఆహారం పూర్తిగా పాడైపోయి, కలుషితమైందని తెలిపారు. అందువల్ల వారికి మరుసటి రోజు నుంచి వెంటనే విరేచనాలు, వాంతులు, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం లాంటివి వచ్చాయన్నారు. బయట ఇలాంటి ఆహారం తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కల్తీ ఆహారం వల్ల శరీరంలో తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని చెప్పారు. లేదంటే అనారోగ్యంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.
ఆహార కల్తీలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ - బయట తింటే ఖతమే - నమ్మలేని నిజాలివే!