తెలంగాణ

telangana

ETV Bharat / state

దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం - ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! - HEAVY RAINFALL ALERT

కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం - రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా తీరం వైపు కదిలే అవకాశం - పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

HEAVY RAINFALL ALERT
IMD Issues Heavy Rainfall Alert in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

IMD Issues Heavy Rainfall Alert in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వెంబడి దూసుకొస్తోంది. అది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. వచ్చే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వైపు కదలనుంది. దీని ప్రభావంతో ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇవాళ విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. వాటితో పాటు అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, శ్రీకాకుళం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ నెల 20న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారిందని, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

విశాఖ తీరంలో ఎగసిపడుతున్న అలలు (ETV Bharat)

వాతావరణ మార్పుల ప్రభావం

ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ నెల 18న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ పరిస్థితుల మేరకు గత నెల, ఈనెలలో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటతాయని వాతావరణ నిపుణులు ఆచార్య భానుకుమార్‌ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు ఏపీలో దాటుతున్నట్లు వివరించారు. డిసెంబర్​ చివరి తేదీల్లో అండమాన్‌ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐరోపాకు చెందిన మోడల్‌ సూచిస్తోంది.

బీ అలర్ట్​ - ఉత్తరాంధ్రలో మళ్లీ 'భీకర వానలు!'

ABOUT THE AUTHOR

...view details