3 People Died In Road Accident : ఓటు వేయడానికి సొంతూరికి వెళ్తూ మార్గ మధ్యలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి జనగామ జిల్లా రఘునాథపల్లిలో జరిగింది. రహదారి పక్కన భార్యాభర్తలు తమ కుమారునితో కలిసి టిఫిన్ చేస్తున్న సమయంలో ఓ ఆర్టీసీ బస్సు టిఫిన్ బండిపైకి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన తెలుకలపల్లి రవీందర్(38) బతుకుతెరువు కోసం బీబీనగర్‌కు వలసవెళ్లి పాత సామాగ్రి వ్యాపారం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు చిన్న సమ్మయ్య, భాగ్యమ్మ వరంగల్‌లోనే ఉంటున్నారు. రవీందర్‌కు ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పెద్ద కుమారుడు పార్థు(12)ను వారివద్దకు పంపించారు. ఓటు వేసి తన కుమారుడిని ఇంటికి తీసుకువద్దామని భార్య, చిన్న కుమారుడితో స్కూటిపై బీబీనగర్ నుంచి వరంగల్ నుంచి బీబీనగర్ బయలు దేరారు. మార్గమధ్యలో బంక్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద కూర్చుని అల్పాహారం తింటుండగా ప్రమాదం జరిగింది.
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం! - RTC Bus Accident in kothagudem Dist
Road Accident In Jangaon District :సరిగ్గా అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న వరంగల్ ఆర్టీసీ డిపో-1 కు చెందిన రాజధాని ఎక్స్‌ప్రెస్ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న టిఫిన్ సెంటర్‌పైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో రవీందర్ భార్య జ్యోతి(32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవీందర్, అతని చిన్నకుమారునికి తీవ్రగాయాలయ్యాయి. రవీందర్ అతని చిన్నకుమారుడు భవీష్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
దీంతో పెద్ద కుమారుడు పార్ధు తల్లిదండ్రులు లేని అనాథగా మారాడు. ఈ విషయం అందరినీ కలచి వేసింది. ఈ ఘటనలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుల కుటుంబం సభ్యులు రుణావత్ నవీన్, శ్రీకాంత్, రాకేష్, వాహన చోదకుడు కేతావత్ గణేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన బస్సును, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరేష్ తెలిపారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా - ముగ్గురు మృతి - వివాహం ఆగిపోయిందని వరుడి తాత ఆత్మహత్య - 3 PEOPLE DIED IN ROAD ACCIDENT