తెలంగాణ

telangana

ETV Bharat / state

'త్రినయని' నటుడు చందు ఆత్మహత్యపై స్పందించిన భార్య - ఏమన్నారంటే? - Actor Chandu Wife on His Death - ACTOR CHANDU WIFE ON HIS DEATH

Serial Actor Chandu Wife Responded on His Death : బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని, ఆమె మరణంతో డిప్రెషన్​లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని, త్రినయని సీరియల్ సమయంలో పవిత్రతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు.

Serial Actor Chandu Wife Responded on His Death
Serial Actor Chandu Wife on His Death (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 12:47 PM IST

Serial Actor Chandu Wife on His Death :బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్రినయని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని ఆమె అన్నారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ప్రస్తుతం తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు. వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని, ప్రస్తుతం తమ పరిస్థితి కూడా అలాగే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పవిత్ర ఆకస్మికంగా చనిపోవడంతో అతను డిప్రెషన్​కు గురై ఇటీవలే కత్తితో కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నంచాడని శిల్ప అన్నారు. 'పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా' అంటూ ఇన్​స్టాగ్రామ్​లో మెసేజ్​లు కూడా పెట్టినట్లు తెలిపారు. శుక్రవారం అతను ఫోన్ ఎత్తకపోయేసరికి అనుమానం కలిగి తమకు తెలిసిన వారిని అక్కడికి పంపితే అప్పటికే ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య - Serial Actor Chandu Suicide
Serial Actress Pavithra Jayaram Dies in Road Accident :తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం ఇటీవల కన్నుమూశారు. మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న పవిత్ర మరణించగా, ఆమె కుటుంబ సభ్యులు, డ్రైవర్​కు తీవ్ర గాయలయ్యాయి.

అయితే ఆమె సహనటుడు చందుతో పవిత్ర గత ఐదేళ్లుగా సహజీననం చేస్తున్నట్లు తెలిసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక చందు డిప్రెషన్​లోకి వెళ్లాడు. చనిపోయే ముందు రోజు 'పవిత్రా నీ దగ్గరకు వస్తున్నా' అంటూ కత్తితో కోసుకోని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. శుక్రవారం తను నివసించే అపార్ట్​మెంటులో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా అతని పోస్టుమార్టం పూర్తయ్యింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు అనంతరం మృతదేహాన్ని చందు కుటుంబసభ్యులకు అందజేశారు. మృతదేహాన్ని బంధువులు సికింద్రాబాద్​లోని రెజిమెంటల్ బజార్​లోని ఇంటికి తరలించారు.

పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు శిల్ప (ETV Bharat)

ప్రముఖ సీరియల్​ నటి ఆత్మహత్య.. మాజీ బాయ్​ఫ్రెండ్ వేధింపుల వల్లే!

బిగ్​బాస్​ ఫేమ్​ నటి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details