తెలంగాణ

telangana

ETV Bharat / state

శివబాలకృష్ణ నేరంగీకార పత్రంలో సంచలన విషయాలు - ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన - HMDA Ex director siva balakrishna

HMDA Ex director siva balakrishna confession document : హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివ బాలకృష్ణ ఏసీబీ విచారణలో ఓ ఐఏఎస్ అధికారి పేరును ప్రస్తావించినట్లు సమాచారం. నార్సింగి​లోని ఓ ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్‌ రూ.10 కోట్లు లంచం డిమాండ్ చేశారని, అతని ఆదేశాలతోనే అనుమతిచ్చినట్లు శివ బాలకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది.

Siva Balakrishna Case Updates
HMDA Ex Director Siva Balakrishna Confession Document

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 4:32 PM IST

HMDA Ex Director Siva Balakrishna Confession Document :ఆదాయానికి మించిన అక్రమాస్తులను కూడబెట్టిన కేసులో హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ(Siva Balakrishna) నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో ఓ ఐఏఎస్ అధికారి పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించినట్లు సమాచారం. తన నుంచి సదరు ఐఏఎస్ అధికారికి కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారని బాలకృష్ణ ఏసీబీ అధికారులకు వెల్లడించారని తెలుస్తోంది.

Siva Balakrishna Case Updates :నార్సింగిలోని వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ అడ్డగోలు అనుమతులు ఇచ్చారని అధికారులు గుర్తించారు. ఐఏఎస్‌ అధికారి ఆదేశాలతోనే భూమికి క్లియరెన్స్ ఇచ్చిన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిన్నట్లు సమాచారం. నార్సింగిలోని ఓ ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్‌ రూ.10 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు రేరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది.

శివబాలకృష్ణపై కేంద్రదర్యాప్తు సంస్థ ఫోకస్- రంగంలోకి దిగిన ఈడీ

డిమాండ్ చేసిన రూ.10 కోట్లలో కోటి రూపాయలు చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత డిసెంబర్​లో బాలకృష్ణ ద్వారా ఐఏఎస్​కు కోటి రూపాయలు చేరిన్నట్లు సమాచారం. బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో తెలిపిన విషయాల ఆధారంగా ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

మరోవైపు శివ బాలకృష్ణ బెయిల్‌ పిటిషన్​పై నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టు విచారణ చేపట్టింది. అతనికి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని బెయిల్‌ మంజూరు చేయవద్దని ఏసీబీ కోర్టును అభ్యర్ధించింది. ఇప్పటికే బాలకృష్ణను ఏసీబీ అధికారులు 8 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించారని, దీంతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని బాలకృష్ణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది.

Ex HMDA Director Shiva Balakrishna Case :ఏసీబీ అధికారుల 8 రోజల పాటు కస్టడీ తీసుకోని విచారణ చేసిన సంగతి తెలిసిందే.శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగుచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు.

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!

ABOUT THE AUTHOR

...view details