Secunderabad BRS MP candidate On victory : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ నిర్ణయించిన మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్(Parliament) అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమమే తనను గెలిపిస్తుందన్నారు. పద్మారావుకు టికెట్ కేటాయించడంతో పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్, మాగంటి గోపీనాథ్, మహమూద్ అలీ పాల్గొన్నారు.
BRS MP candidate Padma Rao fires on congress :కాంగ్రెస్ ఆరు గ్యారంటీలుఅమలు కాలేదని ప్రజలు ఆ పార్టీని నమ్మి మోసపోయారని పద్మారావు గౌడ్ తెలిపారు. తెలంగాణలో మోదీ(modi) ప్రభావం అంతగా ఉండదని అన్నారు. తెలంగాణలో సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోటీ రసవత్తరంగా ఉంటుందన్నారు.బీఆర్ఎస్లో గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పటిష్ట నాయకత్వంతో పాటు బీఆర్ఎస్కు మంచి నాయకుల(Leaders) తోడ్పాటు ఉందన్నారు. నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజలు కాదని స్పష్టం చేశారు.
మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి
"రాష్ట్రం మొత్తం మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రజలనే మా కుటుంబంగా భావించి బరిలో దిగాం. గత ప్రభుత్వంలో పథకాల అమలు తీరు బాగుండేది. రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. రాబోయే ప్రభుత్వం మాదే అనే నమ్మకం ఉంది"- పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి